ఒక్క యాక్షన్ సీన్ కే 40 కోట్లు!

Update: 2018-06-28 09:11 GMT

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి నత్తనడకన సాగిన సై రా షూటింగ్ గత రెండు నెలల నుండి శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ కూడా బోయపాటి సినిమాలో నటిస్తూనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా చూసుకుంటున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన భారీ సెట్టింగ్ లో చిత్రీకరణ జరుగుతుంది.

హాలీవుడ్ మాస్టర్, ఫైటర్స్ తో...

అయితే ఆ భారీ సెట్ తో పాటు.. ఆ సెట్ లో జరిగే యుద్ధ సన్నివేశాలకు గాను దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ భారీ సెట్లో నరసింహారెడ్డికి - ఆంగ్లేయులకు మధ్య రాత్రివేళలో జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. సైరా సినిమాలో హైలెట్ గా నిలిచే ఈ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. నరసింహారెడ్డిలోని వీరోచిత నాయకుడిని ఆవిష్కరించే సన్నివేశాలుగా ఇవి ఉంటాయట. ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో భారీ సంఖ్యలో హాలీవుడ్ ఫైటర్స్ పాల్గొంటున్నారని చెబుతున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి ఈ వయసులోనూ రాత్రి పూట నిద్రలేకుండా కష్టపడుతున్నారట.

భారీ తారాగణంతో...

మరి హాలీవుడ్ స్టెంట్ మాస్టర్, హాలీవుడ్ ఫైటర్స్ అంటే.. భారీగానే ఖర్చు ఉంటుంది. అందుకే ఈ ఒక్క యాక్షన్ షెడ్యూల్ కె 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటేనే... అదెంత భారీగా ఉంటుందో అర్ధమవుతుంది. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ సన్నివేశాలు హైలైట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అన్ని భాష నటులు నటిస్తున్నారు. అమితాబ్, సుదీప్, జగపతి బాబు వంటి మేటి నటులు కూడా ఈ సినిమా లో నటిస్తున్నారు.

Similar News