అప్పుడు అవకాశం లేదు.. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం!!

ప్రభాస్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్. ప్రభాస్ బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నాడు. అలాంటి హీరోతో ఫ్రెండ్షిప్ అంటే మాటలా.. అందులోను హీరోయిన్స్ కి [more]

Update: 2020-04-25 09:17 GMT

ప్రభాస్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్. ప్రభాస్ బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నాడు. అలాంటి హీరోతో ఫ్రెండ్షిప్ అంటే మాటలా.. అందులోను హీరోయిన్స్ కి మరీను. ప్రభాస్ తో నటించిన చాలామంది హీరోయిన్స్ తో ప్రభాస్ ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. అందులో స్వీటీ అనుష్క కి ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్. అయితే బాహుబలి లో సెకండ్ హీరోయిన్ గా నటించిన తమన్నా ప్రభాస్ తో కలిసి బాహుబలికి ముందు అట్టర్ ప్లాప్ మూవీ రెబల్ లో నటించింది.

అయితే రెబల్ సినిమా అప్పుడు తమన్నాకి ప్రభాస్ తో మాట్లాడే అవకాశం పెద్దగా రాలేదట. రెబల్ సినిమా అప్పుడు ప్రభాస్ త్వరగా షూట్ ముగించుకుని వెళ్లిపోయేవాడట. కానీ బాహుబలిలో ప్రభాస్ తో కలిసి నటించేటప్పుడు మాత్రం ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ చేసే అవకాశం వచ్చింది అని చెబుతుంది తమన్నా. బాహుబలి సినిమాకి ప్రభాస్ చాలా డేట్స్ ఇవ్వడంతో.. ఎప్పుడూ సెట్స్ లో ఉండేవాడని.. అలా తామిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతుంది. ప్రభాస్ తో కలిసి బాహుబలిలో నటించడం ప్రత్యేకం. నటీనటులందరికి బాహుబలి అనేది ప్రత్యేకమైన అనుభూతి అని చెబుతుంది తమన్నా.

Tags:    

Similar News