ఎలిమినేట్ అవుతుందటగా
బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు అనేవి కామన్ గా జరిగేవే. కానీ ఆ గొడవల్లో ఒక హుందాతనం ఉండేది. ఎవరు హద్దులు దాటేవారు [more]
బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు అనేవి కామన్ గా జరిగేవే. కానీ ఆ గొడవల్లో ఒక హుందాతనం ఉండేది. ఎవరు హద్దులు దాటేవారు [more]
బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు అనేవి కామన్ గా జరిగేవే. కానీ ఆ గొడవల్లో ఒక హుందాతనం ఉండేది. ఎవరు హద్దులు దాటేవారు కాదు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డు ద్వారా తమన్న సింహాద్రి ఎంటర్ అయిందో అప్పటినుండి హౌస్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు హౌస్ మొత్తం చాలా సరదాగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆమె ఎంట్రీ ఇచ్చిందో హౌస్ మొత్తం గందరగోళం అయిపోయింది.
తమన్న ధోరణితో…
ఇక నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ అయితే ఛీ.. ఇదేం కార్యక్రమం అంటూ ప్రేక్షకులు ఏవగించుకునేలా మారింది. ముఖ్యంగా నామినేషన్ ప్రాసెస్ లో తమన్న మాటలకు హౌజ్ లో సభ్యులంతా నోరెళ్లబెట్టారు. ఆమె రవిని , అలీ ని ఇద్దరిని ఏది పడితే అది మాట్లాడింది. ఆమె ధోరణి ఇంట్లో సభ్యులకి ఎవరికి నచ్చలేదు. అంత వ్యతిరేకించారు. హౌస్ లో ఏం జరిగిన అల్టిమేట్ గా అది వీకెండ్ వచ్చే నాగార్జునకే చుట్టుకుంటుందనే విషయం తెలిసిందే. ఇటువంటి విషయాల్లో నాగార్జున చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పైగా తమన్న బిహేవియర్ చూస్తుంటే ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులకి కూడా ఆమె తీరు నచ్చడంలేదు.