రూ.200 కోట్ల క్లబ్ లోకి "ది కశ్మీర్ ఫైల్స్"

కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన "ది కశ్మీర్ ఫైల్స్" ఇప్పుడు ఏకంగా రూ.200 క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యానికి..

Update: 2022-03-24 13:15 GMT

హైదరాబాద్ : అతి తక్కువ బడ్జెట్ తో, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా "ది కశ్మీర్ ఫైల్స్". ఒక స్టార్ హీరో లేడు..డ్యూయెట్ లేదు.. యాక్షన్ సీన్స్ లేవు. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన "ది కశ్మీర్ ఫైల్స్" ఇప్పుడు ఏకంగా రూ.200 క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతూ.. కమర్షియల్ మేకర్స్ కు షాకిస్తున్నాయి.

"ది కశ్మీర్ ఫైల్స్" సినిమా గురించి ఏకంగా ప్రధాని మోదీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడటంతో.. సినిమా పై ఆసక్తి పెరిగిందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాను అందరూ చూడాలని చెప్పడంతో.. కలెక్షన్లు పెరిగాయని చెప్తున్నారు. విడుదలైన తొలి ఐదు రోజుల్లో 60కోట్ల 20లక్షలను రాబట్టగా అక్కడ నుండి మొదలైన పాజిటివ్ టాక్ హోరులా మారి రూ.వంద కోట్లు.. రూ.150 కోట్లు.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లోకి చేర్చింది.
దేశవ్యాప్తంగా 600 థియేటర్స్ లో రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్.. అంతకంతకు పెరిగి 4000 థియేటర్ల వరకు చేరింది. 1990లో కశ్మీరి పండిట్స్ పై జరిగిన మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు దర్శకుడు వివేక్. కేవలం 13 రోజుల్లో రూ.200 క్లబ్ లో చేరిన "ది కశ్మీర్ ఫైల్స్".. రేపు విడుదల కాబోతోన్న "ఆర్ఆర్ఆర్" దూకుడును తట్టుకుని నిలబడుతుందా? లేదా? చూడాలి.


Tags:    

Similar News