చంద్రబాబు అరెస్టు ఒక గుణపాఠం అంటున్న హీరో సుమన్..
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సుమన్ చంద్రబాబు అరెస్టు పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో ఇదొక గుణపాఠం అంటూ..
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల అరెస్టు అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. ఈ అరెస్టుని నిరసిస్తూ టీడీపీ నేతలు, ఐటీ ఉద్యోగులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన సి అశ్వినీ దత్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు తదితరులు స్పందించారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సుమన్ కూడా మాట్లాడాడు.
కొంతకాలంగా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతున్న సుమన్.. చంద్రబాబు అరెస్టు పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో పాల్గొన్న సుమన్ చంద్రబాబు అరెస్టుకు స్పందిస్తూ.. "ఒక మాజీ సీఎంని అరెస్టు చేసేటప్పుడు అన్ని ఆలోచించే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. జగన్ గారు వల్లే చంద్రబాబు జైలుకి వెళ్లారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఒక అరెస్టుకి చాలా కారణాలే ఉంటాయి. రాజకీయాల్లో ఇదొక గుణపాఠం" అంటూ పేర్కొన్నాడు.
అలాగే చంద్రబాబు టైం ప్రస్తుతం బాగాలేదని, ఎవరు ఏం చేయలేరని జోష్యం చెప్పాడు. హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఆయన కృషి ఎంతో ఉందని, ఇక్కడ ఉన్నవారంతా హ్యాపీగా ఉన్నారు అంటే అది ఆయన వల్లే అని, ఈ విషయంలో చంద్రబాబుని అభినందించాలి అంటూ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి త్వరగా జైలు నుంచి బయటకు రావాలనే తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా చంద్రబాబు సినీ పరిశ్రమకు ఎంతో చేశారు. అలాంటి వ్యక్తి అరెస్టు అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు మాట్లాడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విమర్శలకు నిర్మాత సురేష్ బాబు బదులిచ్చాడు. 'రాజకీయాలకు, మతపరమైన అంశాలకు సినీ పరిశ్రమ ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. స్టేట్ డివిజన్ విషయం నుంచి ఏ సెన్సిటివ్ విషయాల అయినా చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదు' అంటూ బదులిచ్చాడు.