మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి రచయితే కానీ మంచి కథకుడు కాదు. ఇది నిజం. ఒప్పుకోవాల్సిందే. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. తన కథలను ఏదో ఒక హాలీవుడ్ మూవీ నుండి తీసుకోవడం లేదా నవలల నుంచి ఐడియాలు తీసుకుని తన స్టైల్ మార్చుకుని స్టోరీని రెడీ చేస్తుంటాడు. అజ్ఞాతవాసి విషయంలో ఇదే చేసాడు త్రివిక్రమ్. ఒక హాలీవుడ్ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి తన స్టైల్ లో సినిమా తీసాడు. ఇక రీసెంట్ గా అరవింద సమేతలో మొండికత్తి కానెప్ట్ ను ప్రముఖ కథకుడు వేంపల్లి గంగాధర్ నుంచి తీసుకున్నాడని ఇప్పటికే బయటకు వచ్చింది.
బన్నీతోనూ అదే పంథా
ఈ సినిమా సక్సెస్ అయిపోయింది కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. మరి బన్నీ సినిమా కోసం త్రివిక్రమ్ ఏం చేస్తున్నారు..? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది. బన్నీ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ హిందీ మూవీని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. "సోను కె టిటు కి స్వీటీ" అనే హిందీ సినిమా లైన్ తీసుకుని దాన్ని త్రివిక్రమ్ తన స్టైల్ లో కథను మర్చి పక్కా అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీలా తీర్చిదిద్దాలనుకుంటున్నారట. బన్నీకి ఇప్పటికే ఈ స్టోరీ లైన్ చెప్పినట్టు తెలుస్తుంది. బన్నీ ఓకే అంటే ఈ సినిమానే సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని సమాచారం.