గత వారం విడుదలైన హలో గురు ప్రేమ కోసమే, పందెం కోడి 2 సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చింది. ఇక నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ కాంబోలో తెరకెక్కిన వీర భోగ వసంత రాయులు సినిమాని రేపు విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. ఆయితే సినిమా మీదున్న విపరీతమైన నమ్మకంతో నిన్ననే ఓవర్సీస్ ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. అసలే పూర్ ప్రమోషన్స్ తో ఉన్న ఈ సినిమాకి ఓవర్సీస్ తో మరింత దెబ్బపడిందనే చెప్పాలి. నూతన దర్శకుడు ఇంద్రసేనా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, ఇంద్రసేనాతో వచ్చిన విభేదాలతో హీరో సుధీర్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ ని పక్కనబెట్టి విదేశాలకు చెక్కేసాడు. ఇక మిగతా వారు కూడా ఈ సినిమా ని లైట్ తీసుకున్నారు కాబట్టే.. ఈ సినిమా గురించిన విషయాలేమి ప్రేక్షకులకు తెలియడం లేదు.
సినిమాకు నెగెటివ్ టాక్...
ఇకపోతే నిన్న ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమా టాక్ పూర్తిగా నెగెటివ్ గా ఉండడంతో సినిమాకి ఇక్కడ ఓవరాల్ గా దెబ్బపడినట్లే. అసలు ఈ సినిమా కథ ఎలా వుంది అంటే... నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీయ ముగ్గరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఈ ముగ్గరు ఆఫీసర్స్ డిఫరెంట్ మిస్టరీ కేసులను డీల్ చేస్తారు. అసలా కేసులేమిటి..? ఈ సినిమాకి వీర భోగ వసంత రాయలు అని పేరెలా వచ్చింది..? అనేది మిగతా కథగా తెలుస్తుంది. మరి ఓవర్సీస్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇక్కడేం హిట్ అవుతుంది. అసలు సినిమాలో చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ ఏం లేవని ఓవర్సీస్ క్రిటిక్స్ చెబుతున్నమాట. చివరి పదిహేను నిమిషాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సినిమా మొదటి నుండి అంటే టైటిల్స్ నుండి పరమ చెత్తగా ఉండడంతో ఆ పదిహేను నిమిషాల ఫీలింగ్ కూడా ఫైనల్ గా ఉండదని అంటున్నారు.
ముందు విడుదల చేయడంతో...
అసలు ఏం చూసి ఈ సినిమా ను నారా రోహిత్, శ్రీయ, సుదీర్ బాబు ఒప్పుకొన్నారు అనే డౌట్ సినిమా చూస్తే తప్పక కలుగుతుంది. ఇక బరువైన పాత్రలో నటించిన శ్రీ విష్ణు ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. మరి ఇప్పటికే నారా రోహిత్ కి బలమైన బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ సినిమాకి అసలు బిజినెస్ జరగలేదని అంటున్నారు. మరి అలాంటి టైం లో ఓవర్సీస్ లో ముందు విడుదల చేసి ఇక్కడ విడుదల చెయ్యకుండా నిర్మాతలు తప్పు చేశారనిపిస్తుంది. శుక్రవారమే రెండు చోట్ల విడుదల చేస్తే టాకెలాగున్న ఓపెనింగ్స్ బాగుండేవని... ఇప్పుడు అక్కడ వచ్చిన టాక్ తో ఇక్కడ ఘోరమైన ఓపెనింగ్స్ ని వీర భోగ వసంత రాయులు సొంతం చేసుకుంటుందని అంటున్నారు. చూద్దాం రేపు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అనేది.