డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ - వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'ఎఫ్ 2' షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సంక్రాంతి కానుగా రిలీజ్ అవుతున్న ఈసినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. కామెడీ ను డీల్ చేయడంలో అనిల్ ఎక్స్పర్ట్. ఈసినిమాలో కూడా తనదైన శైలి కామెడీ తో నవ్వించబోతున్నాడని సమాచారం.
స్టార్టింగ్ టూ ఎండింగ్ సినిమా మొత్తం నవ్వులే నవ్వులంట. ఎక్కడ ఒక్క ఫైట్ కూడా వుండదట. కేవలం మాటలతో పంచ్ లు ఉంటాయట. ఈసినిమా వరకు అనిల్ ఫైట్స్ అన్నవి పక్కన పెట్టేసాడని తెలుస్తుంది. ఫైట్స్ లో కామెడీ యాంగిల్ ని చూపించే అనిల్ ఈసినిమాలో అది కూడా చేయలేదని టాక్. ఇటీవలే రష్ చూసి నిర్మాత దిల్ రాజు సన్నిహితులు కొందరు ఈ సినిమా సూపర్ గా వచ్చిందని అంటున్నారట.
సంక్రాంతికి ఇది సరైన సినిమా అని అంటున్నారట. వెంకటేష్ 'మల్లీశ్వరి' తరువాత ఇంతలా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేసింది ఈసినిమాలోనే అంట. వరుణ్ తేజ్ కూడా ఇప్పటివరకు డిఫరెంట్ సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ కామెడీ సినిమాలు చేయలేదు. ఈసినిమాతో ఇద్దరి కోరికలు తీరనుంది. మరో వైపు దిల్ రాజుకి ఈసినిమా చాలా కీలకం కానుంది. 2018 లో దిల్ రాజు కాంపౌండ్ నుండి వచ్చిన సినిమాలన్నీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. సో దిల్ రాజు ఈసినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు