అర్జున్ రెడ్డితో ఎవరి అండ లేకపోయినా.. సోలో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ గీత గోవిందంతో స్టార్ హీరో అవతారమెత్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చిన విజయ్ తన యాటిట్యూడ్ తో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించాడు. గీత గోవిందంతో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోలు కూడా అందుకోవడానికి తత్తరపడుతున్న టైంలో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టాడు. తాజాగా రేపు శుక్రవారం తమిళంలో నటించిన నోటా సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే గీత గోవిందం టైంలో హీరోయిన్ రష్మికతోనే కాకుండా సోలోగా సోషల్ మీడియా ద్వారా సినిమాని తెగ ప్రమోట్ చేసాడు. కొత్తగా రౌడీస్ అని తన అభిమానులను సంభోదిస్తూ గీత ప్రమోషన్స్ చక్కబెట్టాడు.
ఒంటరిగా నోటా ప్రమోషన్స్
ఇక తాజాగా కూడా నోటా విషయంలో సోలో ఫైట్ చేస్తున్నాడు విజయ్. నోటా సినిమాని గత పది రోజుల క్రితం వరకు ఎప్పుడు రీలీజ్ చెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్న నోటా టీం తో పాటు విజయ్ ఒక పోల్ ద్వారా నోటా రిలీజ్ డేట్ డిసైడ్ చేసాడు. ఇక సినిమా విడుదలకు సమయం ఎంతో లేకపోవడంతో.. తెలుగు, తమిళ ప్రమోషన్స్ కి విజయ్ చాలా శ్రమ పడుతున్నాడు. హీరోయిన్ మెహ్రీన్ తోడు లేకుండా నోటా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అసలే మరో వారానికే అరవిందుడు అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేతతో పోటీ ఉండడంతో విజయ్ నోటా ప్రమోషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
తెలుగులో ఇంకా రాని క్రేజ్...
ఇప్పటికే తమిళనాట బిగ్ బాస్ ద్వారా బుల్లితెరతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఇక్కడ తెలుగులోనూ గట్టి ప్రమోషన్స్ ఇస్తున్నప్పటికీ.. విజయ్ చేసే ప్రమోషన్స్ నోటాకి క్రేజ్ తీసుకురావడం లేదు. విజయ్ దేవరకొండ తప్ప ఇంకే ఆర్టిస్టులు ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ లోనే కాదు అసలు బయట కనిపించడం లేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తమిళ్ మీడియాతో విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన డెబ్యూ గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి తమిళనాట నోటా విషయం ఎలా ఉన్నప్పటికీ.. తెలుగులో నోటా మీద బజ్ క్రియేట్ అవడం లేదు. ఏదో వెబ్ అండ్ ప్రింట్ మీడియాకి నోటా యాడ్స్ తో ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ.. విజయ్ కి ఉన్న క్రేజ్ కూడా నోటా విషయంలో ఏమైందో అర్ధం కావడం లేదు.
మిగిలింది నాలుగు రోజులే...
ఇక ఈ నాలుగు రోజుల్లో నోటా ప్రమోషన్స్ ని పిచ్చెక్కించకపోతే నోటా టాక్ విషయంలో తేడా జరగొచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ నోటా కనీసం హిట్ అందుకోవాలి. లేదంటే ఎంత త్వరగా పేరొచ్చిందో.. అంత త్వరగా కిందకి పడే అవకాశం ఉంది. ఇలా ఎందుకంటున్నామంటే గీతతో 100 కోట్ల క్లబ్బులో చేరాక కూడా విజయ్ టాక్సీవాలా విడుదల కష్టాలు ఎదుర్కొంటూనే ఉంది.