మనవాడు విజయ్ దేవరకొండ ఇక్కడ మంచి పేరు, మార్కెట్ ని సంపాదించుకోడమే కాకుండా తమిళం లో కూడా తన మార్కెట్ ను పెంచుకోటానికి చాలానే ట్రై చేస్తున్నాడు. అక్కడ మనవాడు తమిళ స్పీచ్ తో ఇరగకోటేస్తున్నాడట. అక్కడ తమిళ హీరోస్ తెలుగులో ప్రొమోషన్స్ కి వచ్చి అంతంత మాత్రానా తెలుగులో మాట్లాడితే మన వాడు ఏకంగా అక్కడ తమిళ కవుల కోట్స్‌ని కూడా ఉదహరిస్తూ స్పీచులు ఇచ్చేస్తున్నాడు.
అతను రీసెంట్ గా నటించిన 'నోటా' చిత్రం చేసేటప్పుడు అంతగా తమిళం వచ్చేది కాదు. అయినా కానీ ఏదో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడి తన ఫస్ట్ ప్రెస్ మీట్ ని కంప్లీట్ చేసాడు . 'నోటా' సినిమా అయిపోయేలోపు నేను కచ్చితంగా తమిళంలో మాట్లాడతానని ప్రామిస్ చేసిన విజయ్.. అన్నట్టుగానే ఆ భాషపై పట్టు సాధించి స్పీచ్ ను కుమ్మేసాడు. ఇంత అనర్గళంగా తమిళం మాట్లాడుతున్న విజయ్‌ని, అతని డెడికేషన్నీ చూసి, అక్కడి మీడియా, సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.
తమిళ భాష నేర్చుకునేందుకు ఓ ట్యూటర్ని పెట్టుకుని, ఆ భాషని నేర్చుకున్నాడు విజయ్. ఇక తమిళం.. తెలుగులో ఓకేసారి రూపొందిన 'నోటా' సినిమా వచ్చే నెల 5న మన ముందుకు రానుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా హిట్ అయితే తమిళంలోనూ పాగా వేసేయాలని చూస్తున్నాడు విజయ్. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలుగు ప్రొమోషన్స్ లో భాగంగా విజయవాడ, హైదరాబాద్ లలో మీటింగ్ పెట్టనున్నాడు విజయ్.