యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ తమిళ భాషలో 'నోటా' అనే సినిమా చేసి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు లో కూడా డిజాస్టర్ అయింది. దాంతో మనోడు తమిళ ఇండస్ట్రీ వైపు ఇప్పటిలో కన్ను వేయడు అనుకున్న టైములో మరోసారి తమిళ చిత్రానికి ఓకే చేశాడు.
ద్విభాషా చిత్రం గా వస్తున్న ఈసినిమా ను డ్రీం వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ ఆర్ ప్రభు నిర్మించనున్నారు. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేయనున్న ఈసినిమా తెలుగు , తమిళ భాషల్లో రూపొందనుంది. ఇందులో విజయ్ కి తోడుగా తమిళ రైజింగ్ కమెడియన్ యోగిబాబు నటించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది. విజయ్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో పాటు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు అయిపోయిన తరువాత తమిళ డైరెక్టర్ తో ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకుని వెళ్తాడు. విజయ్ కి జోడిగా ఇందులో ఎవరు నటిస్తారో తెలియాల్సిఉంది. 'నోటా' తో డిజాస్టర్ అందుకున్న విజయ్ వెంటనే మళ్లీ తమిళ సినిమాలపై ఎందుకు పడ్డాడో అర్ధం కావట్లేదు.