కోలీవుడ్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్న వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతి స్థానంలో ఇళయ దళపతి విజయ్ ఉంటాడు. ఇప్పుడు విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విజయ్ మురుగదాస్ డైరెక్షన్ లో తన 62 ఫిలిం లో నటిస్తున్నాడు. మురుగదాస్ - విజయ్ సినిమా టైటిల్ సర్కార్ అంటూ ఎనౌన్సమెంట్ చెయ్యడమే కాదు.. నిన్న విజయ్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం సర్కార్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక సర్కార్ లుక్ లో విజయ్ సిగరెట్ తాగుతూ అలా కూర్చుని ఉంటే... అబ్బా విజయ్ ఫోజ్ ఏముందిరా అనేలా అనిపిస్తుంది. సర్కార్ లో విజయ్ స్టైలిష్ లుక్ చుసిన విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సిగరెట్ తాగడంపై మండిపడ్డ ఎంపీ
అయితే మురుగదాస్ - విజయ్ ల కాంబో లో తెరకెక్కుతున్న సర్కార్ లుక్ కి ఎంతగా రెస్పాన్స్ వచ్చిందో సోషల్ మీడియాలో వచ్చిన లైక్స్, షేర్స్ చూస్తుంటే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మురుగదాస్ - విజయ్ ల సర్కార్ లుక్ మీద తమిళనాట వ్యతిరేకత మొదలైంది. సర్కార్ లుక్ లో విజయ్ సిగార్ తాగుతూ కనిపించడంతోనే సమస్య మొదలైంది. తమిళ ఎంపీ అయిన మాజీ ఆరోగ్యశాఖా మంత్రి అన్బుమని రామదాస్.. పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగే లుక్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సినిమా పోస్టర్ ద్వారా సిగరెట్ బ్రాండ్ ని నువ్వు ప్రమోట్ చేస్తున్నావా... నువ్వు ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక హీరోగా స్మోకింగ్ చేస్తే ఎన్ని అనర్ధాలు వస్తాయో.. అనేది చెప్పాల్సిన నువ్వు ఇలా సిగరెట్ తాగుతూ ప్రజలకు ఎం చెప్పాలనుకుంటున్నావ్’, ‘ఎప్పుడూ సినిమాల్లో సిగరెట్ తాగనని గతంలో నువ్వు చెప్పావు.. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి’ అంటూ అన్బుమని రామదాస్, విజయ్ మీద విరుచుకుపడ్డారు. అయితే అన్బుమని రామదాస్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో ఆయన మీద విజయ్ ఫాన్స్ గుర్రుగా వున్నారు.
గతంలోనూ వివాదాలు...
మరి ఫస్ట్ లుక్ కే ఇలాంటి నిరసనలు మొదలు పెడితే.. సినిమా పూర్తై విడుదలయ్యాక మరెన్ని వివాదాలు వస్తాయో అని విజయ్ అభిమానులు ఆందోళణ చెందుతున్నారు. ఇక విజయ్ గత సినిమా మెర్సల్ విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెర్సల్ సినిమాలో డాక్టర్లని కించపరిచే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ సినిమా విడుదలయ్యాక డాక్టర్స్ బ్యాచ్ అంతా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే జీఎస్టీ మీద ఉన్న డైలాగ్స్ విషయంలో బీజీపీ పెద్ద రాద్దాంతమే చేసింది.