క్రేజీ హీరోకే సినిమా విడుదల కష్టాలా..!

Update: 2018-09-21 07:15 GMT

విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో ‘నోటా’ అనే ద్విభాషా చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో జరిగిన ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్‌ వెన్నలకంటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

తల్లికి అనారోగ్యంతో...

అయితే ఈ వివాదాం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. శశాంక్‌ వెన్నలకంటి తన రైట్స్ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు. ఈ విషయంపై వెన్నెలకంటి చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మరి దీని వల్ల తెలుగులో సినిమా ఏమైనా లేట్ అయ్యే అవకాశముందో తెలియాల్సిఉంది. ఇది ఎప్పటికి రాజీకి వస్తుందో చూడాలి. అలాగే విజయ్ దేవరకొండ తల్లికి అస్వస్థతగా ఉండడంతో తల్లి కోసం టైం స్పెండ్ చెయ్యడం.. నోటా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో ఈ సినిమా మీద క్రేజ్ కూడా పెరగడం లేదనంటున్నారు.

రెండు సినిమాలు ఆలస్యమేనా..?

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ‘ఇరుముగన్’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో విజయ్ కి క్రేజ్ ఉండటం వల్ల ఈ సినిమా తెలుగు రైట్స్ భారీ ఎత్తున చెబుతున్నారు మేకర్స్. దీంతో తెలుగులో ఈ సినిమాను కొనడానికి ఎవరూ ముందు రావడం లేదు. మరోపక్క విజయ్ నటించిన టాక్సీవాలా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటే పెద్ద అనుమానం. అలాంటి టైంలోనే మంచి అంచనాలున్న నోటా కూడా వివాదాల్లో ఇరుక్కోవడం విజయ్ ని కాస్త ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. చూద్దాం అంత క్రేజ్ ఉన్న విజయ్ సినిమాల కష్టాలు ఎప్పుడు తీరతాయో అనేది.

Similar News