రూమర్స్ పై స్పందించిన విజయ్..!

Update: 2018-07-10 10:13 GMT

కోలీవుడ్ లో పలు సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్.. హీరోయిన్ అమలా పాల్ ని పెళ్లి చేసుకుని కొంత కాలం తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం వారు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే విజయ్ ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు గత కొంతకాలంగా కోలీవుడ్ లో షికారు చేస్తున్నాయి.

మనస్థాపానికి లోనైన అమలా పాల్

రీసెంట్ గా అంటే రెండు వారాల కిందట అమలా పాల్, విజయ్ కి కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో త్వరలోనే విజయ్ ఇంకో పెళ్లి చేసుకుంటున్నట్టు..అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అన్న వార్తలు కోలీవుడ్ వినపడుతున్నాయి. విజయ్ రెండో పెళ్లి గురించి తెలుసుకున్న హీరోయిన్ అమలా పాల్ మనస్తాపానికి లోనైందనీ తెలుస్తుంది.

రెండో పెళ్లి చేసుకోవడం లేదు...

ఒక షూటింగ్ నుండి అమలా పాల్ వెళ్లిపోయందని..ఆమె ఇంకా విజయ్ గురించే ఆలోచిస్తుందన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే దీనిపై విజయ్ స్పందిస్తూ.. నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. తన గురించి తన పెళ్లి గురించి రాసే ముందు నన్ను అడిగి రాసుంటే బాగుండేదని అయన తెలిపారు. దీంతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టినట్టైంది.

Similar News