విక్రమ్ కండిషన్: సమంత ఒప్పుకుందా?

నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. కరోనా లేకపోతె ఈ సినిమా ఇప్పటికే థియేటర్స్ లోకి వచ్చేసేది. నాగ చైతన్య [more]

Update: 2020-07-01 02:06 GMT

నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. కరోనా లేకపోతె ఈ సినిమా ఇప్పటికే థియేటర్స్ లోకి వచ్చేసేది. నాగ చైతన్య – భార్య సమంత తో కలిసి హోమ్ క్వారంటైన్ లోనే ఉంటున్నాడు. అయితే నాగ చైతన్య లవ్ స్టోరీ తర్వాత విక్రమ్ కుమార్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. విక్రమ్ కుమార్ ఇప్పటికే చైతు స్క్రిప్ట్ ని పూర్తి చేసుకుని చైతు కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే విక్రమ్ కుమార్ – నాగ చైతన్య తో ఓ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే తాజాగా నాగ చైతన్యకి విక్రమ్ కుమార్ ఓ కండిషన్ పెట్టాడట.

అది మన సినిమాలో హీరోయిన్ గ సమంత నే నటించాలని చెప్పాడట. మరి విక్రమ్ ప్లాన్ ప్రకారం చైతు సమంత జోడి కడితే ఆ సినిమాకి ఆటోమాటిక్ గా క్రేజ్ వస్తుంది. అందుకే సమంత హీరోయిన్ గా కావాలని అడుగుతున్నాడు. మరోపక్క సమంత మాత్రం తెలుగు లో సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. ఓ బేబీ తర్వాత సమంత సౌత్ సినిమాలేవీ సైన్ చెయ్యలేదు. కేవలం ఫ్యామిలీ మాన్ వెబ్ సీరీస్ తప్ప సమంత. మరే సినిమాకి సైన్ చెయ్యకుండా అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంది. మరి నాగ చైతన్యతో సమంత అని గతంలోనే వార్తలొచ్చినా.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ కండిషన్ కి మాత్రం చైతు ఒప్పుకున్నాడట. కానీ సమంత మాత్రం ఇంకా హోల్డ్ లోనే పెట్టినట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News