‘శీనయ్య’కు మళ్లీ మోక్షం

వివి వినాయక్ దర్శకుడిగా కెరీర్‌లో వెనకబడిన సందర్భంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఆయనని హీరోగా పెట్టి సినిమా తీసేందుకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా [more]

Update: 2020-02-23 15:37 GMT

వివి వినాయక్ దర్శకుడిగా కెరీర్‌లో వెనకబడిన సందర్భంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఆయనని హీరోగా పెట్టి సినిమా తీసేందుకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ ఆపేశారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. వార్తలు వినిపించడమే కాదు అదే వాస్తవం. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసి వినాయక్ తృప్తి పడడం లేదని.. ఆలాగే కథలో గందరగోళంతో వినాయక్ స్వయానా దిల్ రాజుకి చెప్పి షూటింగ్ ఆపేసాడని ఒకవైపు నుంచి కాదు కాదు దిల్ రాజే కావాలని శీనయ్య షూటింగ్‌ని హోల్డ్ లో పెట్టాడని మరోవైపు వార్తలు వినిపించాయి. ఎవరివైపు ఏది ఉన్నా సరే.. షూటింగ్ మాత్రం ఆపేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శీనయ్య షూటింగ్ మళ్లీ మొదలైందని తెలుస్తుంది.

సెకండాఫ్ స్ర్కిఫ్ట్ విషయంలో దిల్ రాజు, వినాయక్ కూర్చుని మాట్లాడుకున్నారని, చిన్న చిన్న మార్పులతో ఇద్దరు ఏకీభవించడంతో తిరిగి ఈ సినిమాని సెట్‌పైకి తీసుకువచ్చారని తాజాగా అందుతున్న వార్తల్లోని సారాంశం. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ఆగకూడదనే నిర్ణయం కూడా వారిద్దరు తీసుకున్నారని తెలుస్తుంది. సో.. టోటల్‌గా దర్శకుడు వినాయక్ హీరోగా మారే సినిమాకి అడ్డంకులు తొలగినట్లే అని మాత్రం అర్ధమవుతుంది.

Tags:    

Similar News