గతంలో కోలీవుడ్ హీరో విశాల్ సినిమాల పైరసీ లేకుండా చేస్తానని ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ పైరసీ సైట్లు వారు స్వీకరించారు. ఇక నుండి విశాల్ ప్రతి సినిమా పైరసీ చేస్తామని ప్రకటించారు. గత కోనేళ్ళుగా విశాల్ పైరసీను ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అయినా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఈనేపధ్యంలో 'పందెంకోడి-2 ' కూడా పైరసీ బారిన పడింది.
పందెం కోడి కూడా పైరసీ.......
నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈసినిమా పైరసీ హెచ్ డీ క్వాలిటీతో పెట్టేసారు. దాదాపు 2 జీబీ ఉన్న ఈసినిమా తమిళ వెర్షన్ చాలా త్వరగా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది.. దాంతో విశాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులో త్రిచూర్, తంజావురు జిల్లాల్లో ఎక్కువగా పైరసీ జరుగుతుందని తెలిసి ఆ ప్రాంతాల్లో 'పందెంకోడి-2 ' ను విశాల్ రిలీజ్ చేయలేదు.
పైరసీని అరికట్టాలనుకుంటే.....
అలా తన సొంత బిజినెస్ కూడా వదులుకుని పైరసీ ని అరికట్టాలనుకున్నాడు కానీ పైరసీ భూతం ఆగలేదు. గతంలో విశాల్ నటించిన 'డిటెక్టివ్' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. విశాల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ పైరసీ ని ఆపలేకపోతున్నాడు. ఎన్ని చేద్దాం అనుకున్నా పాపం అన్ని ఎదురు దెబ్బలే.