మాస్ లుక్ లో మెగాస్టార్ : ఫ్యాన్స్ కు దీపావళి ట్రీట్
రంగు బనీనుపై పూల చొక్కా .. పైకి కట్టిన లుంగీ .. చెవికి రింగులు .. మెళ్లో బంగారు చైన్లు .. ఒక చేతికి బంగారు కడియం ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. చిరంజీవి సరసన శృతిహాసన్ అలరించనుంది. చిరంజీవి 154వ సినిమా పేరు వాల్తేరు వీరయ్య అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిని ఖరారు చేస్తూ.. దీపావళి ట్రీట్ గా టైటిల్ పోస్టర్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు. తనను సవాల్ చేసిన వారికి వీరయ్య తనదైన స్టైల్లో సమాధానం చెప్పడమనే యాన్ సీన్ పై టీజర్ ను కట్ చేశారు.
రంగు బనీనుపై పూల చొక్కా .. పైకి కట్టిన లుంగీ .. చెవికి రింగులు .. మెళ్లో బంగారు చైన్లు .. ఒక చేతికి బంగారు కడియం .. మరో చేతికి గోల్డ్ వాచ్ .. బ్లాక్ స్పెట్స్ తో కనిపిస్తూ .. బీడీ దమ్ము కొడుతూ చిరంజీవి మాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. వీరయ్యకి సినిమాలో యూట్యూబ్ వీడియోలు చేసే అలవాటున్నట్లు టీజర్లో చెప్పారు. 'ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ .. షేర్ .. అండ్ సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ లైవ్ లోనే వీడియో చేసేయడం చూపించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య బరిలోకి దిగనున్నాడు.