ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మళయాల సూపర్ స్టార్ మమ్మట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన తెలుగులో మళ్లీ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 20 నుండి సెప్టెంబర్ వరకూ లాంగ్ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. 2003 లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద వాళ్ల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవటానికి కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి అనే నినాదంతో పాదయాత్ర మొదలుపెట్టినట్లుగానే.. ఇప్పుడు ఈ యాత్ర చిత్రం కూడా అదే విధంగా నాన్ స్టాప్ షెడ్యూల్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఇదే లాంగెస్ట్ షెడ్యూల్ గా కూడా చెప్పవచ్చు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రాలకి మంచి ఆదరణ వుంది ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. ఈ చిత్రం కూడా వారి అంచనాలు అందుకునేలా ఉంటుందని అంటున్నారు చిత్ర మేకర్స్. అంతేకాదు రాజశేఖర్ రెడ్డిని మరోక్కసారి స్మరించుకునేలా ఈ చిత్రం అందరిని ఆకట్టకుంటుందని చెబుతున్నారు.
వైఎస్ ఇమేజ్ కి తగ్గట్లుగా...
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘‘60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో ప్రతి ఇంటి గడప లోకి వెళ్ళి పెదవాడి కష్టాలను, ఆవేదనని చూసి బరువెక్కిన గుండెతో ప్రజల హ్రుదయాల్లో స్థానం సంపాదించిన ఎకైన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన బయెపిక్ ని ఆయన ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరిస్తాము. మా బ్యానర్ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ లో ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యి చిత్రాలు తీయలేదు. మా గత రెండు చిత్రాలు కూడా కథ డిమాండ్ ప్రకారం కాంప్రమైజ్ కాకుండా చేశాము. అదే విధంగా మేము తలపెట్టిన ఈ భారీ సంకల్పమైన యాత్ర ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తాము. మా గత రెండు చిత్రాలు మాదిరిగానే మా ప్రోడక్షన్ వాల్యూస్ ని రెట్టింపు చేసేలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి అందిస్తాము.’’ అని అన్నారు.