అభినేత్రి ఐనా కోన అభినయాన్ని చూపుతుందా??

Update: 2016-10-05 12:37 GMT

ఏ దర్శకుడైనా స్క్రిప్టుకు ప్రధాన స్థానం ఇవ్వక మానరు. కథా కథనాలు బలంగా ఉంటే ముఖం తెలియని నటులను కూడా అగ్ర తారల స్థానాన నిలబెడతారు ప్రేక్షకులు. కధనంలో నిమగ్నమై సినిమా చూస్తుంటే భారీ సెట్లను కానీ, విదేశీ లొకేషన్లను కానీ అడగరు. స్క్రిప్టుకు అంత ప్రాధాన్యత ఇస్తుంటారు సగటు ప్రేక్షకుడు. అందుకే దర్శకులు వాళ్ళ శైలికి బాగా తగినట్టు రాయగలిగే రచయితలకు పదే పదే అవకాశాలు ఇస్తుంటారు. ఆలా శ్రీను వైట్ల దగ్గర రచనా బృందంగా ఏర్పడ్డ కోన వెంకట్, గోపి మోహన్ లు ఎన్నో సక్సెస్ఫుల్ కథ కథనాలు అందించారు.

కానీ కొన్ని వివాదాల కారణంగా శ్రీను వైట్ల నుంచి దూరం జరిగి బైట సినిమాలకు రాయటం ప్రారంభించిన కోన వెంకట్ కు కాలం కలిసి రాలేదు. వరుసగా అఖిల్, బ్రూస్ లీ(శ్రీను వైట్ల తో వివాదం తర్వాత మళ్లి కలిసి చేసిన చిత్రం), సౌఖ్యం, శంకరాభరణం, త్రిపుర, డిక్టేటర్ వంటి చిత్రాలతో వరుసగా పరాభవాలు చవి చూసారు కోన వెంకట్. ఆ చిత్ర వైఫల్యాల తర్వాత కొంత విరామం తీసుకుని ఇప్పుడు అభినేత్రి చిత్రంతో మళ్లి రచయితగా పని చేసారు. ఈ చిత్రం 7 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రమైన కోన వెంకట్ కు రచయితగా పూర్వ వైభవం తెస్తుందో లేదో చూడాలి.

అభినేత్రి చిత్రంలో ప్రభు దేవా, సోను సూద్, తమన్నా భాటియా ప్రధాన తారాగణం గా కనిపించనున్నారు. ఈ చిత్రంతో పాటు గా కోన వెంకట్ అక్కినేని నాగ చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ల కలయికలో రానున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Similar News