అమీర్ ఎంతగా ఒదిగిపోయాడో ట్రైలర్ చెప్తోంది!

Update: 2016-10-22 00:46 GMT

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీసుకు తన కుస్తీ పట్టు చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కుస్తీ నేపథ్యంలో వచ్చిన సుల్తాన్ తో సల్మాన్ బ్లాక్ బస్టర్ అందుకోగా.... అదే టైపు సినిమాతో బాలీవుడ్లో సరికొత్త రికార్డులు బద్దలు చేసేందుకు రెడీ అనేశాడు అమీర్. 2014లో ధూమ్ త్రీ, గత ఏడాది పీకేతో క్రిస్మస్ సెంటిమెంటును నిజం చేసుకున్న అమీర్ ఖాన్.. ఈఏడాది దంగల్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కు సిద్ధమయ్యాడు. బయోపిక్ లకు, నేచురాలిటీకి ఫిదా అవుతున్న బాలీవుడ్ లో మరో రియల్ లైఫ్ స్టోరీతో కలెక్షన్ల మోత మోగించబోతున్నాడు.

అమీర్ ఏ రేంజ్ హిట్ కొడతాడో దంగల్ ట్రైలర్ చూసిన వారందరికీ ఈ పాటికే అర్థమైపోయుంటుంది. ఏ సినిమా చేసినా ఆ క్యారెక్టర్లో పాతుకుపోయే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. దంగల్ సినిమాలోని మహావీర్ సింగ్ పొగట్ రోల్ లో కూడా ఒదిగిపోయాడు. అతడి జీవిత కథను చెప్పడంతోపాటూ అమ్మాయిల పవరేంటో కూడా రుచిచూపించబోతున్నాడు. ఈ సినిమాలో పాత్ర కోసమే వెయిట్ పెరిగి, గెటప్ చేంజ్ చేసి.. మిడిల్ ఏజ్ క్రాస్ అయిన మనిషిలా కనిపిస్తున్న అమీర్.. ఒక పాత్ర కోసం తనను తాను ఎంత మార్చుకుంటాడో మరోసారి చూపించేశాడు. సల్మాన్ నిర్మాతగా తెరకెక్కిన చిల్లర్ పార్టీతో బాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేసిన నితేష్ తివారీ ఈ సినిమాకు డైరెక్టర్. హీరోయిన్ల మెరుపులు, విలన్లతో యాక్షన్ సన్నివేశాలు, చేజింగులు లేకుండానే మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సై అంటున్నాడు అమీర్.

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అని తనను ఎందుకంటారో ప్రూవ్ చేయనున్నాడు. ఒక్కో సినిమాకూ ఏడాది గ్యాప్ తీసుకుంటున్నా.. ఆ వెయిటింగ్ కు తగ్గట్టు మంచి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అమీర్. పీకే తర్వాత దంగల్ తో తెరపై కనిపించబోతున్న అమీర్ ఈ సినిమాతో కొత్త రికార్డులు సృష్టించడమనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.. అది ఏ రేంజిలో ఉంటుందన్నదే వేచి చూడాలి.

Similar News