అమీర్ ఖాన్ ను పిచ్చోడు, ఇడియట్ అంటున్న నిర్మాత

Update: 2016-10-22 04:57 GMT

ఆమిర్ ఖాన్ అనే పేరు టైటిల్ కార్డు లో కనపడితే కచ్చితంగా ఆ చిత్రంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ ఉంటుంది అని ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోయింది. ఆమిర్ ఖాన్ కూడా స్టార్ స్టేటస్ కాపాడుకునేందుకు, అగ్ర స్థాయి పోటీ లో ఉండేందుకు సంవత్సరానికి రెండేసి చిత్రాలు నటించాలనే వాణిజ్య నిర్ణయాల జోలికి పోకుండా కథా బలం వున్న కథలు తన వద్దకు వచ్చినప్పుడు ఆ కథలోని పాత్రను తనదైన శైలిలో పోషించి మెప్పించటానికి, మానసికంగా శారీరకంగా తనను తాను సిద్ధపరచుకోవటానికి సమయం వెచ్చిస్తాడు. కానీ ఒకసారి చిత్రీకిరణ మొదలుపెడితే నిరంతరాయంగా పూర్తి చేస్తాడు ఆమిర్.

ఇంతటి విలక్షణ కోణాలు కలిగిన ఆమిర్ ఖాన్ ని తనతో రెండు చిత్రాలు చేసిన నిర్మాత విధు వినోద్ చోప్రా ఆమిర్ ఖాన్ ను ఒక ఇడియట్ గా అభివర్ణించారు. దానికి కారణం కూడా ఆమిర్ కి సినిమాపై వున్న అమితమైన ప్రేమ, పాత్రలో పరకాయ ప్రవేశం చేసే లక్షణమే. ఇటీవల విడుదల ఐన దంగల్ ప్రచార చిత్రానికి లభిస్తున్న ప్రేక్షాకాదరణ వర్ణనాతీతం. ప్రచార చిత్రాన్ని చుసిన విధు వినోద్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, "ఆమిర్ ఒక ఇడియట్. నిజంగా పిచోళ్లు మాత్రమే చేసే సినిమా ఇది. సినిమా పిచోడు కాబట్టే ఆమిర్ 51 ఏళ్ళ వయసులో తన శరీరానికి మితిమీరిన కష్టం ఇచ్చి దంగల్ చిత్రంలోని రెస్ట్లెర్ పాత్రను చక్కగా పోషించాడు." అని ట్వీట్ చేసారు.

గతంలో ఆమిర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా నిర్మించారు. ఆ చిత్రం నాటికి 44 ఏళ్ళ ఆమిర్ 21 సంవత్సరాల కాలేజీ స్టూడెంట్ గా మారి మెప్పించాడు. విధు వినోద్ చోప్రా నిర్మించిన మరో చిత్రం పీకే లో ఆమిర్ గ్రహాంతర వాసి పాత్ర పోషించగా, ఆ చిత్రం నేటికీ భారతీయ చిత్రాలలో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వుంది.

Similar News