అమ్మో అంత రెమ్యునరేషనా!

Update: 2016-10-18 12:04 GMT

ఇప్పుడు బుల్లితెర మీద లేడీ యాంకర్స్ కి ఎంత బాగా పాపులర్ ఉందొ.... అలాగే మేల్ యాంకర్స్ = కూడా బుల్లితెర మీద తమ హవా కొనసాగిస్తున్నారు. వారిలో ముందుగా యాంకర్ రవి తన సత్తా సాటాడు. రవి యాంకర్ లాస్యతో కలిసి బుల్లితెరమీద చెయ్యని ప్రోగ్రాం లేదు. అలాగే తాను ఒక్కడే యాకరింగ్ చేస్తూ కూడా తన టాలెంట్ చూపించాడు. ఇక రవి తర్వాత ప్రముఖం గా ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు పేరు బుల్లితెర మీద బాగా వినిపిస్తున్న పేరు. ప్రదీప్ ఇంజినీరింగ్ చదివి ఐటి కంపెనీలో జాబ్ చెయ్యకుండా ఇలా బుల్లితెర మీద సెటిల్ అయిపోయాడు. అలాగే యాంకరింగ్ చేస్తూనే తన సొంత ప్రొడక్షన్ లో అతనే హోస్ట్ గా 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు ప్రదీప్. ఇక అమ్మాయిల యాంకర్స్ లో సుమ అంటే అందరికి ఎంత అభిమానమో అబ్బాయిల యాంకర్స్ లో ప్రదీప్ అంటే అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక సుమకి గట్టిపోటీనే ఇస్తున్నాడు మనోడు.

యాంకరింగ్ లో దూసుకుపోతున్న ప్రదీప్ రెమ్యునరేషన్ వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. అతను ఏ ప్రోగ్రాం ని హోస్ట్ చేసిన.... ఒక్కో ఎపిసోడ్ కి అక్షరాలా ఒక లక్ష తీసుకుంటాడట. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి అయితే 50, 000 దాకా ఛార్జ్ చేస్తాడని సమాచారం. ఇక ఒక ప్రోగ్రాం అని కాదు అన్నిటీలో ఇప్పడు ప్రదీప్ పేరే ప్రముఖం గా వినబడుతుంది. ఇక ప్రదీప్ ఒక నెలకి దాదాపు 20 లక్షల వరకు ఈ యాంకరింగ్ ద్వారా సంపాదిస్తాడని అంటున్నారు. మరి ఒకవేళ ఐటి కంపెనీ లో జాబ్ చేస్తే గనక ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ప్రదీప్ బుల్లితెరమీద కేవలం నెలలో సంపాదించేసున్నాడన్నమాట. ఎంతైనా ప్రదీప్ లక్కీగా ఈ బుల్లితెర మీద గట్టిగా పాతుకుపోయాడనే చెప్పొచ్చు.

Similar News