ఆ చిత్రం ఆవిడ అభిమానులను ఇబ్బంది పెడుతుంది

Update: 2016-12-12 08:29 GMT

తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకులకు సమానంగా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ వున్న కథానాయిక అనుష్క శెట్టి అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అనుష్క కెరీర్ ప్రారంభ దశ నుంచి ఒక వర్గ ప్రేక్షకులను మాత్రమే అలరించటానికి పరిమితం కాకపోవటమే ఇందుకు కారణం. సూపర్, విక్రమార్కుడు, డాన్, ఒక్క మగాడు, బిల్లా వంటి పలు చిత్రాలతో గ్లామర్ క్వీన్ గా ప్రేక్షకులకు చేరువ ఐన అనుష్క అరుంధతి, పంచాక్షరీ, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలలో హుందా పాత్రలలో అభినయం ప్రదర్శించి ప్రేక్షకులకు చేరువ అయినప్పటికీ అటువంటి కథలకే పరిమితం కాకుండా మధ్యలో వేదం వంటి అనితర సాధ్యమైన చిత్రాల్లోనూ సరోజ గా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.

అనుష్క ప్రతి సారి వైవిధ్యమైన కథలని ఎన్నుకుంటూ, సాధ్యమైనన్ని విభిన్నమైన పాత్రలు పోషించే క్రమంలోనే సైజు జీరో చిత్రం చేసింది. ఆ చిత్రంలో పోషించిన పాత్ర కోసం తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి చాలానే కసరత్తు చేయాల్సివచ్చింది అనుష్క కి. అయితే ఆ చిత్రం ఫలితం నిరాశపరచటంతో స్వీటీ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడు వారికి ఆ చిత్ర వైఫల్యం కన్నా కూడా సైజు జీరో కోసం స్వీటీ తన శరీరాకృతి పెంచుకున్న తరువాత అంత వేగంగా తగ్గలేకపోతుండటం కలవర పెడుతుంది. రానున్న చిత్రాల్లోనూ స్వీటీ ని గ్లామరస్ గా చూడలేకపోవటాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఒకేసారి బరువు తగ్గినప్పటికీ అనుష్క కు పలు అవకాశాలు చేతిలో ఉండటం విశేషం.

ఈ నెల 23 న విడుదల కానున్న ఎస్ 3 చిత్రంలో అనుష్క శెట్టి పూర్తి స్థాయిలో కాకపోయినా తన శరీర బరువు విధించిన పరిమితుల్లో గ్లామర్గా కనపడనుంది అనే విషయం చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్స్ ద్వారా స్పష్టం అవుతుంది.

 

Similar News