ఆ విషయంలో శృతిది బ్యాడ్‌రికార్డ్‌...!

Update: 2016-08-25 09:03 GMT

రెండు మూడు నెలలు కష్టపడి ఓచిత్రంలో హీరోయిన్‌గా చేస్తే వచ్చే రెమ్యూనరేషన్‌ కేవలం ఐదు నిమిషాల ఐటంసాంగ్‌లో చేస్తే వస్తుంటే ఎవరు మాత్రం ఎందుకు చేయరు చెప్పండి...! అదే ఇప్పుడు శృతిహాసన్‌ విషయంలో జరుగుతోంది. కాగా ఆమెకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో మంచి ఇమేజ్‌ ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఏ చిత్రం ఒక పట్టాన ఒప్పుకోదనే విషయం తెలిసిందే. కాగా ఆమె కీలకపాత్ర పోషిస్తున్న నాగచైతన్య 'ప్రేమమ్‌' త్వరలో విడుదల కానుంది. అదే సమయంలో ఆమె తన తండ్రి కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న 'శభాష్‌ నాయుడు' చిత్రాల్లో నటిస్తోంది. ఇక పవన్‌ -డాలీ చిత్రంలో ఆమె మరోసారి పవన్‌తో జోడీ కడుతున్నప్పటికీ ఈచిత్రం షూటింగ్‌లో ఆమె ఇంకా జాయిన్‌కాలేదు. ఇకమాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖల్‌ గౌడ్‌ హీరోగా పరిచయం అవుతున్న 'జాగ్వార్‌' చిత్రంలో ఓ ఐటం చేయడానికి శృతిహాసన్‌ ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతున్నచ సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆ ఒక్క పాటలో నటించినందుకు గాను శృతిహాసన్‌కు రెండు కోట్లు ఇవ్వడానికి నిర్మాత సిద్దం అయ్యాడు.ఈ చిత్రం దాదాపు 70కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. అయితే శృతి గతంలో మహేష్‌బాబు 'ఆగడు', బాలీవుడ్‌లో 'ఒక్కడు'కు రీమేక్‌ 'తేవర్‌'లో ఆమె ఐటం సాంగ్స్‌ చేసింది. ఈ రెండు చిత్రాలలో ఆమె నటించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ బ్యాడ్‌సెంటిమెంట్‌ను మోస్తున్న శృతిని మరీ ఒప్పించిన 'జాగ్వార్‌' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచిచూడాల్సివుంది...!

Similar News