ఆమె డెసిషన్ ఎవ్వరికీ నచ్చలేదు మరి!

Update: 2016-09-23 12:43 GMT

అన్ని భారతీయ భాషలలోనూ పాటలు పాడిన టాప్ సింగర్ ఎస్ జానకి. జానకమ్మ అలా పాడుతుంటే కోకిల గానం లా అందరూ మైమరచిపోయి వింటారు. ఆమె పాట వీనులకు విందుగా ఉంటుంది. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు పాటను తేనెలో ముంచి అందించిన స్వరం జానకి సొంతం. అయితే జానకమ్మ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె అభిమానులందరూ ఈ వృథా విని నిరాశలో కూరుకుపోయారు. అదేమిటంటే జానకమ్మ తన రిటైర్మెంట్ ను ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. దాదాపు 60 సంవత్సరాలుగా 48 వేలకు పైగా పాటలను పాడి సినీ సంగీత అభిమానులను మంత్రముగ్దులను చేసిన ఈవిడ సడన్ గా ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది. అయితే ఈవిడ రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం మాత్రం వయసు మీద పడుతున్న కారణంగా గాయనిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఎస్ జానకి తెలిపారు.

తాను చివరగా పాడిన మలయాళ పాట అయిన 'అమ్మాపోవిను' అనే పాటను రికార్డ్ చేశారు. అనూప్ మీనన్, మీరా జాస్మిన్ కాంబినేషన్ లో 10 కాల్పనికాల్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో చివరిగా పాడిన ఈ పాటన తనకు నచ్చిన పాటగా చెప్పింది జానకి. ఈ సందర్భంగా జానకీ, ఇకపై పాటలు పాడదలుచుకోవడం లేదని ప్రకటించేసింది. కారణం మాత్రం వయోభారమేనని వెల్లడించింది. ఇక నుండి సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదంటూ వివరించింది. జానకి కోకిల వంటి తన గాత్రంతో ఆలపించిన ఎన్నో పాటలు సంగీతాభిమానులకు వీనుల విందు చేస్తున్నాయి. ఎస్ జానకి సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నది. చివరగా జానకి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సందర్భంలో సోషల్ మీడియాలో జానకి మరణించినట్టు ప్రచారం చేయటంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కాగా జానకి చాలా ఆరోగ్యంగా ఉన్నదని, గాయనిగా మాత్రమే ఆమె రిటర్మెంట్ ప్రకటించిందని వారు ఘాటుగా స్పందించారు.

Similar News