ఇండస్ట్రీలో పరపతి వాడను అంటున్న నారా

Update: 2016-10-21 12:08 GMT

చిత్ర పరిశ్రమలో ఇప్పటి తరం యువ తారలతో అధిక శాతం సినిమా కుటుంబం నుంచి వచ్చినవారే. అందు వల్ల తక్కిన నటులకన్నా నిర్మాతల చూపు వీరిపై ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ కుటుంబ నేపధ్యం కేవలం వెండి తెర కు ఆర్బాటంగా పరిచయం అవ్వటానికే తప్ప, ఎల్లకాలం ప్రతిభ కనపరచకుండా నట వారసులం అని చెప్పుకుంటే ప్రేక్షకాదరణ దక్కే రోజులు కావివి. కొందరికి సినిమా పరిచయాలు, చిత్ర పరిశ్రమలో పలుకుబడి ఉన్న కుటుంబ నేపధ్యం ఉంటే, మరి కొందరికి రాజకీయ బలం ఉన్న కుటుంబ నేపధ్యం ఐయి ఉంటుంది.

యువ కథానాయకుడు నారా రోహిత్ అయితే అటు రాజకీయ బలం, ఇటు చిత్ర పరిశ్రమలో పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చి నట జీవితం ప్రారంభించాడు. అందువల్ల నారా రోహిత్ సినిమాలకి ఫైనాన్సియర్లు ఎగబడతారని, నిర్మాతలు రోహిత్ చెప్పుచేతలలో ఉంటారని ఆరోపణలు వినిపిస్తుంటాయి. వీటికి స్పందిస్తూ, "ఫైనాన్షియర్ ల విషయంలో ఉన్న అభియోగాలు అన్ని అపోహలే. నటన ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు భారీ వ్యయంతో నిర్మితమైన చిత్రాలు ఏవి నా ఖాతాలో లేవు. ఇంకా నాకు ఫైనాన్స్ చేసే వారిని వెతుక్కునే పని ఏమిటి? పరపతి ని వాడు ఎప్పుడు ఏ నిర్మాతని నాతో సినిమా తీయమని అడగలేదు. భవిష్యత్తులో కూడా అటువంటి పనులు చెయ్యను. అయితే ఎప్పటికీ ఇలా తక్కువ వ్యయంతో కూడుకున్న చిత్రాలే చేస్తానని చెప్పను. పెద్ద చిత్రాలలో అవకాశాలు వస్తే చేస్తాను." అని నారా రోహిత్ స్పష్టం చేసాడు.

నారా రోహిత్, రెజినా జంటగా నటించిన శంకర చిత్రం నేడు విడుదల అవుతుంది. అప్పట్లో ఒకడుండేవాడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కథలో రాజకుమారి చిత్రీకరణ దశలో వుంది.

Similar News