ఇండైరెక్టుగా చిన్న మామ హెల్ప్ ఉందా...!!

Update: 2017-02-25 08:01 GMT

గోపీచంద్ మలినేని - సాయి ధర్మ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'విన్నర్' చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం లో సాయి ధర్మ తేజ్ ఎనర్జీ కి, నటనకి ఫుల్ మార్కులు పడిపోతున్నాయి. అసలు ఈ చిత్రంలోని సాయి స్టైలిష్ లుక్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. 'విన్నర్ 'చిత్రం లో సాయి చాల స్టైల్ గా కనిపించాడని అతని ఆ లుక్ వెనుక ఎవరో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలలో లుక్ కన్నా ఈ చిత్రంలో సాయి ధర్మ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని అందరూ తెగ పొగిడేస్తున్నారు.

అయితే ఆ లుక్ వెనుక ఉన్నది ఎవరో కాదంట స్వయానా సాయి ధర్మ తేజ్ చిన్న మామ పవన్ కు 10 ఏళ్లగా కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్న రాజేష్ శ్రమ ఉందని అంటున్నారు. ఇక రాజేష్ - సాయి ధరమ్ లు ఇద్దరు కలిసి ఈ స్టైలిష్ లుక్ తేవడానికి చాలానే శ్రమ పడ్డారట. అందుకే సాయి ధర్మ తేజ్ ఈ 'విన్నర్' చిత్రం లో సూపర్ స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టున్నాడన్నమాట. ఇక ఈ చిత్రంలో సాయికి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

Similar News