ఇంతకూ రెజీనాకు పెళ్లయినట్టా? కానట్టా?

Update: 2016-10-19 12:16 GMT

చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్న కుటుంబాలలో, అందులోనూ ముఖ్యం నేటి యువ తరం జీవన విధానంలో ప్రేమ వివాహాలు సర్వ సాధారణం అయిపోయాయి. అన్ని వర్గాల వారి ప్రోత్సాహంతో నెగ్గుకొచ్చే పరిశ్రమ కావటం వలన ఈ వాతావరణానికి అలవాటు పడిపోయిన సినీ తారలు, వారి కుటుంబాలు అంతర్కుల వివాహాలకు సిద్దపడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగు తమిళ భాషల్లో పేరు గడించిన కథానాయికకు లేచిపోయి పరిణయమాడాల్సి రావటం ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనే కదా మరి...!

మద్రాస్ ముద్దుగుమ్మ రెజినా కాసాండ్రా కి ఈ పరిస్థితి ఎదురు ఐయ్యింది అంట. ఈ విషయం వేరెవరో చెప్పే అవకాశం ఎక్కడ తీసుకుంటారు అని భయపడిందో ఏమో తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. కేవలం చేతులు మాత్రమే కనపడే విధముగా ఒకరి చేతిలో తన చెయ్యి ఉండటం, ఆ చేతి వేలు కి వివాహ ఉండటం గమనార్హం. తనని మనువాడిన వ్యక్తి వివారాలు ప్రస్తుతానికి వెల్లడించాను అని కూడా చెప్పింది. మరి ఆ వ్యక్తి ఎవరో?? అసలు ఇంత కాలం ఎటువంటి ప్రేమ ఊసు బైటకి రాకుండా జాగ్రత్తపడి ఇప్పుడు అకస్మాత్తు గా లేచిపోయి పెళ్లి చేసుకున్నానని ఎందుకు వెల్లడించిందో అని తమిళ పరిశ్రమలో గుసగుసలాడుకుంటున్నారు.

అయితే రెజినా ఆ ట్వీట్ చేసిన గంట సమయానికే ఆ పోస్ట్ తీసివేయటంతో ఇదేదో సినిమా ప్రచారానికి చేస్తున్న కార్యక్రమం అని తీసిపారేస్తున్న వారు లేకపోలేదు. వాస్తవమో, వివాదమే రెజీనానే తేల్చాలి.

Similar News