ఈసారి లేడీ డైరెక్టర్ తో చేస్తానంటున్న లవర్ బాయ్!

Update: 2016-04-07 12:29 GMT

'అలా మొదలైయింది' తో కెరటంలా లేచి 'జబర్దస్త్'తో పడి, ఇప్పుడు కళ్యాణ వైబోగంతో మళ్లీ తేరుకున్నారు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి. రిసెంట్ గా వచ్చిన కళ్యాణ వైభోగంతో మళ్లీ తన మార్క్ చూపించారు నందిని. ఇప్పుడు హీరో నితిన్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇటివలే నందినీ రెడ్డి చెప్పిన ఓ కధకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇష్క్ సినిమాతో తన ప్రయాణం మార్చుకున్నాడు నితిన్. తనకు నప్పే కధలతో వరుస విజయాలను అందుకుటున్నాడు. ఇప్పుడు నందిని కూడా ఇలాంటి ఓ కధతోనే ఎప్రోచ్ అయ్యారట. నితిన్ కు నచ్చింది. నితిన్ 'అ. ఆ' తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుందని సమాచారం.

Similar News