చర్చలు సఫలమైతే ఇద్దరికీ లాభమే....!

Update: 2016-04-05 02:05 GMT

ప్రస్తుతం 'బ్రహ్మూెత్సవం' చిత్రం చేస్తున్న మహేష్‌బాబు ఆ తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్‌ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రం చేయునున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తమిళ స్టార్‌ విజయ్‌ చేత ఓ మంచి పాత్రను చేయించడానికి మురుగదాస్‌ ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది సినిమాలో కీలకపాత్రే అయినా కేవలం 10 నుండి 15 నిమిషాలలోపు మాత్రమే ఈ పాత్ర ఉంటుందని సమాచారం. కాగా ఈచిత్రంలోని ఆ పాత్రకు విజయ్‌ ఒప్పుకుంటే అది విజయ్‌తోపాటు మహేష్‌కి కూడా చాలా మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు తమిళ మార్కెట్‌పై కన్నేసిన మహేష్‌కు ఈ చిత్రంలో విజయ్‌ నటించడం వల్ల ఆయనకు కోలీవుడ్‌లో మరింత క్రేజ్‌ వచ్చే అవకాశం ఉందని, అదే సమయంలో టాలీవుడ్‌ మార్కెట్‌పై కన్నేసిన విజయ్‌కు మహేష్‌ చిత్రంలో నటించడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ పాత్ర విషయంలో విజయ్‌ తీసుకోబోయే నిర్ణయం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.

Similar News