చేతులు కాలకుండా ఆమెకు దాసరి ఏం సలహా ఇచ్చారంటే..

Update: 2016-10-13 07:20 GMT

తక్కువ వ్యయంతో నిర్మితమయ్యే చిత్రాలకు చిత్రీకరణ సమయంలో కానీ, నిర్మాణాంతర కార్యక్రమాలలో, విడుదల ప్రణాళిక తప్పుతున్నప్పుడు ఇలా ఏ చిన్న సినిమా ఐనా ఆలోచన మొదలై ఆచరణకు కార్యరూపమై విడుదల వరకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తారు చిత్ర పరిశ్రమ పెద్ద దర్శక రత్న దాసరి నారాయణ రావ్. శోభారాణి నిర్మాణంలో తెరకెక్కనున్న 100 డిగ్రీస్ సెల్సియస్ అనే చిత్ర చిత్రీకరణ ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రూపొందనుంది.

చిత్ర ప్రారంభోత్సవానికి కథానాయికలు ఐన లక్ష్మి రాయ్, నికీషా పటేల్, అరుంధతి నాయర్ లపై క్లాప్ నిచ్చారు దాసరి నారాయణ రావ్. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, "తెలుగు చిత్రాల్లో తెలుగు తనం తగ్గిపోతుంది. మన పరిశ్రమ ఇంగ్లీష్ పరిశ్రమ అయిపోతుంది. టైటిల్స్ కూడా ఆంగ్లంలో వేస్తున్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇతర అన్ని భాష పరిశ్రమలను గౌరవిస్తుంది. అలానే ఇక్కడికి వచ్చే నటీనటులు తెలుగు నేర్చుకుని పరిశ్రమలోకి రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయికలు మళ్లీ నాతో వేదిక పంచుకునేటప్పుడు తెలుగులోనే మాట్లాడాలి. లేకపోతే నేను వేదిక దిగి వెళ్ళిపోతాను. అలానే నిర్మాత శోభారాణి తెలుగు చిత్రం తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆవిడకి ఉన్న అభిరుచికి ఎన్నో తమిళ సినిమాలు అనువదించి చేతులు కాల్చుకుంది. అందుకే అంత డబ్బు పోగొట్టుకోవటం ఎందుకు? నేరుగా తెలుగు చిత్రమే తీయమని చెప్పా."

ఎప్పుడో తప్ప తెలుగు సినిమా అవకాశాలు అంది పుచ్చుకోని కథానాయికలు లక్ష్మి రాయ్, నికిషా పటేల్, అరుంధతి నాయర్ దాసరి మాట గౌరవించి తెలుగు భాష నేర్చుకుంటారో లేదో చూడాలి మరి.

Similar News