జాగ్వార్ పై పంపిణీదారులకి సెంటిమెంట్ భయం

Update: 2016-10-04 06:03 GMT

సినిమా పరిశ్రమలో పలుకుబడి ఉన్న వాళ్ళు, రాజకీయ పరపతి ఉన్న వాళ్ళు వారి వారి వారసులని పరిచయం చేసే సినిమాలకు పరిమితికి మించి ఖర్చు చేయటం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ప్రముఖ చలన చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయ చిత్రానికి తన సొంత డబ్బుని భారీగా ఖర్చు చేసి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటి తమన్నా భాటియా చేత ప్రేత్యేక గీతం చేపించారు. పరిమితికి మించిన వ్యయం కారణంగా ఆ చిత్రం ఆర్ధిక నష్టాలూ చెవి చూసింది. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్ కూడా వినాయక్ దర్శకత్వంలో పరిచయ నటుడి మార్కెట్ పరిధికి మించిన వ్యయంతో తెరకెక్కి ఘోర పరాజయం చెందింది.

ఈ విజయ దశమి పండుగకు విడుదల కానున్న జాగ్వార్ చిత్ర కథానాయకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి మనువడు అని తెలిసిన విషయమే. నిఖిల్ పరిచయ చిత్రం ఐన జాగ్వార్ 75 కోట్ల భారీ వ్యయంతో నిర్మితం కావటం, పైగా తమన్నా ప్రత్యేక గీతం కూడా ఉండటం ఈ చిత్ర పంపిణీదారులకు దడ పుట్టిస్తుంది. ఈ నెల 6 వ తారీకున విడుదల కానుంది ఈ చిత్రం. మరుసటి రోజున నాగ చైతన్య నటించిన ప్రేమమ్, సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహె, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన మన ఊరి రామాయణం, ప్రభు దేవా తమన్నాల అభినేత్రి విడుదల కానున్నాయి.

నాలుగు చిత్రాల పోటీ ని తట్టుకుని జాగ్వార్ ఏ మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి. జాగ్వార్ చిత్ర దర్శకుడు మహాదేవ్ గతం లో తన తొలి చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన మిత్రుడు చిత్రానికి దర్శకత్వం వహించారు. జాగ్వార్ దర్శకుడిగా ఆయనకు రెండవ చిత్రం.

Similar News