ట్రైలర్ తో మంచి మార్క్ లు కొట్టేస్తున్న సూర్య సినిమా!

Update: 2016-04-13 00:05 GMT

కొన్ని ట్రైలర్స్ ని చూసిన వెంటనే యమా అర్జెంట్ గా ఆ సినిమాని చూసేయాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఆలాంటి ఫీల్ ని కలిగించే ట్రైలర్స్ జాబితాలో ఇప్పుడు సూర్య 24 సినిమా చేరిపోయింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్ విడుదలైయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఆసక్తిరేపిన 24... ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేసింది. అద్భుతంగా వుందీ ట్రైలర్. మూడు పాత్రలు( సూర్య ట్రిపిల్ యాక్షన్) చుట్టూ జరిగే కధ ఇది. తన దైన స్క్రీన్ ప్లే ఆ పాత్రలను చూపించి కధను గెస్ చేసే భాద్యత ప్రేక్షకుల పై వదిలేశాడు విక్రమ్ కుమార్. ట్రైలర్ కధను రివిల్ చేయకుండా ఇలా ప్రేక్షకుల ఆలోచనే వదిలేయడం మరింత ఆసక్తిని రేపింది. విజువల్స్ అన్నీ చాల కొత్తగా వున్నాయి. రెహ్మాన్ స్కోర్ ట్రైలర్ నను మరో స్థాయికి తీసుకువవెళ్ళింది. ఓ క్యాచి పాట కూడా వినిపించారు. మొత్తమ్మీద యమా గ్రిప్పింగా సాగిందీ ట్రైలర్.

Similar News