తనని దక్షిణాది సినీ పరిశ్రమలు సాఫ్ట్ టార్గెట్ చేశాయట

Update: 2017-02-17 07:27 GMT

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు చేత పరిచయం కాబడిన కథానాయికలు స్టార్ హీరోయిన్స్ అవుతారనే సెంటిమెంట్ తెలుగు చిత్ర పరిశ్రమలో వుంది. అయితే ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ తన కెరీర్ గ్రాఫ్ ని ఉదాహరణగా చూపుతోంది ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైన తాప్సి పన్ను. తెలుగు, తమిళ భాషలలో పలు సినిమాలు చేసినా, వెంకటేష్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోస్ సరసన నటించిన కథానాయికగా స్టార్ స్టేటస్ ని చూడలేకపోయింది తాప్సి పన్ను. గత ఏడాది బొంబాయి వెళ్లి చేసిన ప్రయత్నాలు ఫలించటంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంది తాప్సి.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్న ఈ ఢిల్లీ బ్యూటీ తాను నటించిన రన్నింగ్ షాదీ డాట్ కామ్ చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలపై పలు ఆరోపణలతో కూడిన కామెంట్స్ చేసింది. "నేను నా నటనా ప్రతిభ ని చూపించటానికి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడితే తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తిగా నన్ను గ్లామర్ హీరోయిన్ గానే ఎక్సపోజ్ చేసింది. అదృష్టవ శాత్తు బాలీవుడ్ లో బేబీ వంటి చిత్రంలో షబానా పాత్ర పోషించే అవకాశం, వెంటనే పింక్ వంటి చిత్రంలో పూర్తిగా యాక్టింగ్ స్కోప్ వున్న అవకాశం, ఇప్పుడు రన్నింగ్ షాదీ డాట్ కామ్, నామ్ షబానా లతో ఇంకా మంచి పేరు వస్తోందని నమ్ముతున్నాను. బాలీవుడ్ నాకోసం సృష్టించిన పాత్రలని తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు సృష్టించలేకపోయాయి. దక్షిణాది సినిమాలు నన్ను సాఫ్ట్ కొర్నార్ చేశాయి కాబట్టి నా కెరీర్ లో చాలా సంవత్సరాలు వృధా అయిపోయాయని భావిస్తున్నాను." అంటూ దక్షిణాది సినిమా పరిశ్రమలపై తన అక్కసు ని వెలిబుచ్చింది ఢిల్లీ బ్యూటీ తాప్సి పన్ను.

Similar News