ఈ ఏడాది దీపావళికి తమిళ నటుడు సూర్య కి ఎంతగానో కలిసొచ్చిన సింగం సిరీస్ లో మూడవ భాగం ఎస్ 3 విడుదల కావాల్సి ఉండగా తమిళ తెలుగు భాషల్లో తన తమ్ముడు కార్తీ నటించిన క్రేజీ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కాష్మోరా చిత్రానికి గ్రాండ్ ఓపెనింగ్స్ కి దారి ఇవ్వటానికి స్వతహాగా దీపావళి బరి నుంచి వైదొలిగాడు సూర్య. అయితే కాష్మోరా ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ ఫుల్ రన్లో ఆశించిన ఆర్ధిక లాభాలు తీసుకు రాలేకపోయింది. దీపావళి ఐన ఎనిమిది రోజులకే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు అంటూ అకస్మాత్తు తీర్మానం చేయటంతో అనేక ఇతర చిత్రాల మాదిరిగానే డిసెంబర్ నెల కి వాయిదా పడింది ఎస్ త్రీ.
ఇక డిసెంబర్ 9 న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విన్నపం మేరకు సూర్య మరో సారి 23 కు తన చిత్ర విడుదల వాయిదా వేసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధ్రువ చిత్రానికి గ్రాండ్ వీకెండ్ బిజినెస్ కి పరోక్ష కారణమయ్యాడు సూర్య. ఇంకా 23 వ తేదికి సరిగ్గా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పుడు వర్దా తుఫాను ప్రభావం మద్రాస్ పట్టణంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉండటంతో సూర్య చిత్రం క్రిస్టమస్ బరి నుంచి కూడా తప్పుకోవటం దాదాపు ఖరారు అయినట్టే అని తెలుస్తుంది. అయితే క్రిస్టమస్ తరువాత మళ్లీ అనుకునాన్ని థియేటర్లు ఎప్పుడు కుదురుతాయి ఎస్ 3 కి. బహుశా నిర్మాతలకి కూడా థియేటర్ల జాబితాపై ఇంకా స్పష్టత వాచినట్టు లేదు. అందుకే ఇంకా ఎస్ 3 కొత్త విడుదల తేదీ ప్రకటించలేదు.