దీపావళికి కూడా యూట్యూబ్ లోనే సందడి

Update: 2016-10-18 09:55 GMT

చిత్రీకరణ వ్యయం పాత రోజుల నాటికి నేటికీ భారీగా తగ్గినప్పటికీ, పారితోషికాలు అధికంగా పెరిగిపోవటంతో చిత్ర బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. అందుకే పెట్టుబడికి నష్టం రాకూడదని ఆలోచించి విడుదల ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటినే అమలు చేస్తున్నారు నిర్మాతలు. కచ్చితం గా ఏ పెద్ద సినిమా కైనా ముందు వెనుక రెండు వారాల వ్యవధి పెట్టుకుని తమ చిత్ర విడుదలకు థియేటర్లు బ్లాక్ చేసుకుంటున్నారు. దీర్ఘ కాలిక ప్రదర్శనలు సినిమాలకి తగ్గిపోవటం మరొక కారణం కావొచ్చు. అయినా తారల అభిమానుల మధ్య పోటీ తగ్గలేదు. మొన్న విజయ దశమికి, రాబోతున్న దీపావళికి కూడా ఆ పోటీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది.

విజయ దశమికి విడుదల అయినా చిత్రాల సంఖ్య ఐదు కాగా వాటిల్లో రెండు చిత్రాలే తెలుగు చిత్రాలు. మిగిలినవి అనువాద చిత్రాలే. కానీ టీజర్ విడుదలలు యూట్యూబ్ లో పోటీ వాతావరణాన్ని నెలకొలిపాయి. విజయ దశమి సందర్భముగా నందమూరి బాల క్రిష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రచార చిత్రాన్ని విడుదల చెయ్యగా, అదే రోజున రామ్ చరణ్ తేజ్ ధ్రువ, శర్వానంద్ శతమానం భవతే చిత్రాల టీజర్లు, రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రపు స్పెషల్ షాట్స్ విడుదలై ఆన్లైన్ వ్యూస్ విషయంలో పోటీ ఎదురైయ్యింది. రాబోతున్న దీపావళి నాడు వెంకటేష్ నటిస్తున్న గురు, మహేష్ బాబు మురగదాస్ ల చిత్రపు ప్రచార చిత్రాల తో పాటు గోపి చంద్ నయనతారల బలం ఫస్ట్ లుక్ కూడా ఆన్లైన్ లో విడుదల కాబోతున్నాయి.

చిత్ర వసూళ్ల లో ఎంత పోలిక, పొంతన, పోటీ ఉంటుందో అలానే ఇప్పుడు ఒక హీరో చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్లకు ఇతర హీరోల టీజర్ మరియు ట్రైలర్లకు వచ్చే వ్యూస్ కి అదే స్థాయి పోటీ ఉంటుండటం విశేషం.

Similar News