నందమూరి-పూరీ మరోసారి :: కాంబినేషన్‌కు సారీ!!

Update: 2016-10-22 10:04 GMT

ఎన్టీఆర్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని 'జనతా గ్యారేజ్' సినిమా రిలీజ్ అయినప్పటినుండి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్తకి బలం చేకూర్చేలాగా పూరి కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం పూరి డైరెక్షన్ లో తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన 'ఇజం' సినిమా రిలీజ్ తర్వాతే పూరితో సినిమాకి కమిట్ అవుతాడని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. మరి పూరి ఒక పక్క 'జనగణమన' స్టోరీ ని మహేష్ ని కాదని ఎన్టీఆర్తో చెయ్యడానికి సిద్ధమయ్యాడని వార్తలొస్తున్నాయి.

కానీ ఎన్టీఆర్ నుండి ఏవిధమైన రెస్పాన్స్ లేదు. అయితే ఇప్పుడు అన్న కళ్యాణ్ రామ్ 'ఇజం' సినిమా రిలీజ్ అయ్యిందికాబట్టి ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక 'ఇజం' సినిమాకి మిక్స్డ్ టాక్ తో రివ్యూస్ పడ్డాయి. మరి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న 'ఇజం' ని చూసిన ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం. పాపం పూరి ఏమో 'జనగణమన' ని ఎలాగైనా ఎన్టీఆర్ తో తీద్దామని డిసైడ్ అయ్యాడు. ఇక ఎన్టీఆర్ డెసిషన్ మీదే పూరి 'జనగణమన' ఉంటుందా లేదా అనేది తేలుతుంది.

Similar News