నటన అంటే ఆ హీరోయిన్ ఇంట్లో ఒప్పుకోలేదు

Update: 2016-10-12 05:43 GMT

హీరోయిన్ చెల్లెలి పాత్రలు, హీరోయిన్ స్నేహితురాలి పాత్రలు చేస్తూ ఒక ఊహించని భారీ విజయంతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అందాల భామ రీతూ వర్మ. బాద్షా చిత్రంతో తెరంగేట్రం చేసి ‘ఎవడే సుబ్రమణ్యం’ లో రెండవ కథానాయిక పాత్ర పోషించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ తాను సోలో హీరోయిన్ గా చేసిన పెళ్లి చూపులు విడుదల తర్వాత రీతూ వర్మ స్థాయి మారిపోయింది. అతి చిన్న సినిమాగా విడుదలై 17 కోట్ల రూపాయల ప్రపంచ వ్యాప్తపు వసూళ్లు సాధించి పెద్ద ప్రకంపనలే సృష్టించింది.

మరి అంతటి ఘన విజయంలో భాగం ఐన కథానాయిక కాబట్టి తదుపరి అవకాశాలు వెల్లువెత్తటం సహజం. అయితే రీతూ వర్మ కు ప్రస్తుతం తమిళం లోనూ రెండు చిత్రాలు ఉండటం విశేషం. చైనా, పిఱై తేదీయ నాటికళ్ అనే రెండు చిత్రాలు చేస్తుంది రీతూ. మరాఠి కుటుంబంలో పుట్టిన తెలంగాణ ప్రాంత వాసి ఐన రీతూ విజయ దశమి వైభవంగా జరుపుకుంటూ, పెళ్లి చూపులు వంటి చిత్రం వరకు నేను రాగలగటానికి కుటుంబ సభ్యులను ఒప్పించటం అతి కష్టం ఐయింది అని చెప్పుకొచ్చింది. డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్, లాయర్ లానే ఆక్టర్ అంటే ఒక వృత్తి అని ఆ వృత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని చెప్పి ఒప్పించుకోటానికే అధిక సమయం పట్టింది అంట రీతూ వర్మకి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన మూడు సంవత్సరాల లోపే అమ్మడు సోలో హీరోయిన్ గా పెద్ద సక్సెస్ చూసేసింది కాబట్టి పరిశ్రమకు వచ్చాక పడ్డ కష్టం కన్నా పరిశ్రమకు రావటానికి పడ్డ కష్టమే ఎక్కువ ఐయి ఉండొచ్చు.

రీతూ వర్మ వెండి తెరకు పరిచయం కాకముందు అనుకోకుండా అనే లఘు చిత్రంలో నటించింది. ఆ లఘు చిత్రం 2012 లో 48hr ఫిలిం కాంపిటీషన్ లో ఉత్తమ లఘు చిత్రంగా బహుమతి గెలిచింది. తరువాతి సంవత్సరం 2013 లో రీతూ వర్మ వెండి తెర పరిచయం జరిగిన సంగతి విదితమే.

Similar News