పట్టించుకోను అంటున్న శృతిహాసన్

Update: 2016-10-14 08:31 GMT

మల్టీప్లెక్స్ లు, అంతర్జాలం పుణ్యమా అని ప్రపంచ సినిమా మన అరచేతికి అందుబాటులో ఉంటుంది. ఒకప్పుడు ఇతర భాషల్లో విడుదల ఐన చిత్రాలు ప్రేక్షకులకు చేరువ అవటానికి రీమేక్ చెయ్యటం మాత్రమే మార్గం. కానీ ఇప్పుడు అన్ని భాషల చిత్రాలు వీక్షించే వెసులుబాటు సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. రీమేక్ అవుతున్న చిత్రాలను ముందుగానే చూసి ఆయా భాషలలో నటించిన నటులతో మన నటీనటుల నటనను పోలిక పెట్టుకోవటం, మాతృకకి, రీమేక్ కి మధ్యన కథనం లో మార్పులు చేర్పులు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రేక్షకులు. మలయాళం ప్రేమ కథ ప్రేమమ్ కూడా తెలుగు ప్రేక్షకులలో సగం మంది చూసిన వారే.

విజయ దశమి సందర్భముగా విడుదల ఐన తెలుగు ప్రేమమ్ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. మలయాళ ప్రేమమ్ రీమేక్ గా విడుదల ఐన ఈ చిత్రంలో తెలుగుతనం దారి తప్పకుండా కథనంతో జాగ్రత్త పడ్డారు దర్శకుడు చందు మొండేటి. ముందు నుంచి సాయి పల్లవి పాత్రకు శృతి హాసన్ ని ఎంచుకున్న దర్శక నిర్మాతలపై వ్యతిరేకత ఎదురుకావడం వాస్తవమే. కానీ అప్పట్లో శృతి ఏమి స్పందించలేదు. విడుదల తర్వాత విజయంపొంది దూసుకెళ్తున్న తరుణంలో ఆవిడ మాట్లాడుతూ, "నేను సాయి పల్లవి చేసిన మేజిక్ ని క్రియేట్ చెయ్యలేను అని అందరూ అభిప్రాయ పడ్డారు. వాటిని నేను పట్టించుకోలేదు. నేను కమల్ హాసన్ కూతుర్ని అని మర్చిపోయి ఆ వ్యాఖ్యలు చేసినట్టున్నారు. చిత్రం విడుదల ఐయింది కాబట్టి ఇప్పుడు నేను సమాధానం చెప్పే సమయం వచ్చింది. నా నోటికి ఆ శ్రమ కలిపించట్లేదు నా నటన." అని విమర్శలను పట్టించుకోను అంటూనే విమర్శించినా ప్రేక్షకులపై ధీటుగా స్పందించింది.

సాయి పల్లవి పాత్రను శృతి హాసన్ పోషించగా, మిగిలిన రెండు కథానాయికల పాత్రలో నటించిన మలయాళ నటులు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ తెలుగులోనూ వారి వారి పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.

Similar News