పాపం కొరటాలా?... పాపం చరణా?

Update: 2017-11-22 10:00 GMT

కొరటాల వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. హిట్ దర్శకుడితో సినిమ చెయ్యాలని చాలామంది స్టార్ హీరోస్ ఎదురు చూస్తారు. వరుసగా మూడు హిట్స్ కొట్టిన కొరటాలతో రామ్ చరణ్ కూడా ఒక సినిమా చేద్దామనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయ్యాక రామ్ చరణ్ కొరటాలను లైట్ తీసుకున్నాడు. కారణాలు మాత్రం తెలియవుగాని.... కొరటాల శివ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడు చరణ్. ప్రారంభోత్సవం కూడా అయిన తర్వాత కొరటాలను పక్కనపెట్టాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు మరోసారి అదే విధంగా కొరటాలకు రామ్ చరణ్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడా..? అంటే.. అవుననే అంటున్నారు చాలామంది.

ఈసారి కూడా కొరటాల సినిమాను రామ్ చరణ్ పక్కనపెట్టొచ్చని.... లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చని వార్తలు వినవస్తున్నాయి. కానీ ఇప్పుడు దీనికి కారణం బోయపాటి శ్రీను. కొరటాల శివతో సినిమాను చరణ్ రెండోసారి ఎనౌన్స్ చేశాడు. కానీ చరణ్ మరోపక్క బోయపాటి సినిమాను మాత్రం ప్రకటించలేదు. కానీ వచ్చే ఏడాది జనవరి నుంచి బోయపాటి సినిమానే స్టార్ట్ చేస్తాడట. మరో వారం రోజుల్లో బోయపాటి సినిమాకు మూహర్తం షాట్ కూడా ఫిక్స్ చేశారనే టాక్ వినబడుతుంది. ఇదే కనుక జరిగితే కొరటాలకు అది అవమానమే.

కానీ మెగా ఫ్యామిలీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. డిసెంబర్ చివరి నుంచి రామ్ చరణ్ ఫ్రీ అయిపోతున్నాడు. కానీ కొరటాల శివ మాత్రం మహేష్ భరత్ అనే నేను సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల భరత్ అనే నేను సినిమా అయ్యే ఈ గ్యాప్ లో బోయపాటితో సినిమా కంప్లీట్ చేయాలని చరణ్ భావిస్తున్నాడట. ఆ తర్వాత కొరటాలతో సినిమా ఉంటుందని చెబుతున్నారు. మరి నిజంగా వీళ్లు చెప్పిందే నిజమైతే మంచిదే. ఒకవేళ ఇది నిజం కాకపోతే హిట్ దర్శకుడిగా ఒక హీరో రిజెక్ట్ చేసిన దర్శకుడిగా పాపం కొరటాల అనాలా... లేకుంటే హిట్ దర్శకుణ్ణి కావాలని అవదులుకున్న చరణ్ ని పాపం అనాలా. చూద్దాం ఏం జరగబోతుందో.

Similar News