పోలిసుల నుండి శ్రీకాంత్ కి నోటీసులు!

Update: 2016-04-08 12:43 GMT

శ్రీకాంత్ హీరోగా 'మెంటల్ పోలీస్' అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. కరణం పి.బాబ్జీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడీ సినిమా వివాదంలో పడింది. తమ మనోభావాలు దెబ్బతినేలా మెంటల్ పోలీస్ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, హీరో, దర్శకుడికి నోటీసులు పపించారు పోలీసులు. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా ఈ సినిమాకు పేరు పెట్టారని... వెంటనే ఆపేరును తొలగించాలని డిమాండ్ చేసింది పోలీసులు సంఘం. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News