ప్రణీతకు లౌక్యం కన్నా ధైర్యం ఎక్కువ 

Update: 2016-10-07 11:46 GMT

సాధారణంగా చిత్ర పరిశ్రమలో కథానాయికలు వారి అభిమాన నటుల పేర్లు ఏ సందర్భం లోనూ బైట పెట్టటానికి ఇష్టపడరు. వారు ఏ చిత్రం చేస్తుంటే ఆ చిత్ర కథానాయకుడితో పని చెయ్యటం చాలా సౌకర్యంగా ఉంది అని మాట దాటేస్తూ లౌక్యం ప్రదర్శిస్తుంటారు. కారణం ఒక ప్రముఖ నటుడా పేరు అభిమాన నటుడిగా చెప్తే ఇతర హీరోల అభిమానులకు దూరం అవుతామేమోనన్న భయం హీరోయిన్ లను వెంటాడుతుండటమే. అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ప్రణీతకు మాత్రం ఆ భయాలు ఏమి లేనట్టు ఉన్నాయి.

శ్రీకాకుళం నగరంలోని ఒక దుస్తుల దుకాణ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ప్రణీత ఆ వేడుక అనంతరం అక్కడ స్థానిక అభిమానులతో ముచ్చట్టించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అయితే ఆ అభిమానుల్లో ఒక అభిమాని తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరు అని ప్రశ్నించగా ఏ మాత్రం తడబాటు లేకుండా, ఏ మాత్రం నాన్చకుండా సూటిగా తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, ఆయనతో నటించే అవకాశం ఎన్ని సార్లు వచ్చినా వదులుకోను అని స్పష్టమైన వివరణ ఇచ్చింది.

ప్రణీత గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఇండస్ట్రీ హిట్ ఐన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది.

Similar News