బాలయ్య 100 వ చిత్రం తనకి 750 వ చిత్రమట

Update: 2017-01-18 10:17 GMT

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలై విజయం దిశగా పరుగులు తీస్తుంది. ఈ చిత్రం పై నందమూరి బాల కృష్ణ అభిమానులు అంతగా ఆశలు పెట్టుకోవటానికి, అంచనాలు పెంచుకోవటానికి ముఖ్య కారణాలు బాలయ్య చాలా కాలం తరువాత చేస్తున్న చారిత్రాత్మక పాత్ర పైగా బాలయ్య కెరీర్ ల్యాండ్ మార్క్ 100 వ చిత్రం కావటమే. అన్నీ అంచనాలు దాటుకుంటూ చిత్ర ప్రదర్శనలు విజయవంతంగా జరుగుతున్న వేళ మరో విశేషం వెలుగు చూసింది. గౌతమీపుత్ర శాతకర్ణి కథానాయకుడు నందమూరి బాల కృష్ణ తో పాటు ఈ చిత్రం గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీతకి కూడా ల్యాండ్ మార్క్ చిత్రమే కావటం గమనార్హం.

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశి కలిపించిన తొలి అవకాశం తోనే గాయని గా స్థిరపడిపోయే అంతటి పేరు ప్రఖ్యాతలని సంపాదించేసుకుంది సునీత. గులాబీ చిత్రంలో 'ఈ వేళలో నువ్వు ఏమి చేస్తూ ఉంటావో' అనే పాట తో ప్లే బ్యాక్ సింగర్ గా ప్రారంభం ఐన సునీత సినిమా కెరీర్, తరువాతి కాలంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ వరుస అవకాశాలు అంది పుచ్చుకుంటూ ప్రముఖ కథానాయికలు సౌందర్య దగ్గర నుంచి అనేకమంది కథానాయికలకు తన గొంతు ని అరువు ఇచ్చిన సునీత తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో కథానాయిక శ్రీయ శరన్ పోషించిన వాసిస్టి పాత్రకి చెప్పిన డబ్బింగ్ తో సునీత ఇప్పటివరకు పనిచేసిన చిత్రాల సంఖ్య 750 కు చేరిందట. బాలయ్య ల్యాండ్ మార్క్ చిత్రమే తనకి కూడా ల్యాండ్ మార్క్ చిత్రం కావటం పైగా ఆ చిత్రం విజయం సాధించటం తో సునీత ఆనందాన్ని పట్టలేకపోతుంది.

Similar News