బాలయ్య సినిమాపై ఎన్టీఆర్ లో ఆసక్తి పుట్టిందిట!

Update: 2016-10-25 08:26 GMT

నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ ని కలవనివ్వకపోవడం తో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దూరం గా ఉంటున్నాడు. ఇక ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ మరియు తన అన్నకళ్యాణ్ రామ్ లతో మాత్రమే సన్నిహిత సంబందాలు కొనసాగిస్తున్నాడు. ఇక బాబాయ్ బాలకృష్ణ తో ప్రత్యక్ష గొడవలైతే లేవుగాని పరోక్షం గా వీరిరువురికి పడడం లేదని పబ్లిక్ అందరికి తెలుసు. ఇక నందమూరి ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ అంటూ ఫాన్స్ కూడా విడిపోయారు. అసలు బాలకృష్ణకి ఎన్టీఆర్ అంటే పొసగదని అందరికి తెలుసు. ఇక ఎన్టీఆర్ కూడా మనకెందుకులే అని సైలెంట్ గా వుంటున్నాడు.

చాలాకాలం నుండి సైలెంటుగా తన పని తాను చేసుకు పోతున్నఎన్టీఆర్ కి ఈ మధ్యన బాబాయ్ బాలకృష్ణ గురించి ధ్యాస ఎక్కువైనట్లుంది. ఆ మధ్యన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ లుక్ ని చూసిన ఎన్టీఆర్ ఈ సినిమా బాబాయ్ తప్ప ఎవరూ చెయ్యలేరని అన్నట్లు వార్తలొచ్చాయి. మరి బాలయ్యని పొగడడం లో ఎన్టీఆర్ ఆంతర్యమేమిటో తెలియదు గాని... ఇప్పుడు వీరి గురించి మరో వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే గౌతమిపుత్రని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ క్రిష్ కి ఎన్టీఆర్ ఫోన్ చేసాడని అంటున్నారు.. 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి సంబంధించి ఏదైనా ఒక ఫ్రెష్ వీడియో చూడాలని క్రిష్ ని ఎన్టీఆర్ కోరాడట. అసలు ఎన్టీఆర్ ఫోన్ చెయ్యడమే క్రిష్ కి షాక్ ఇస్తే ఈ గౌతమీపుత్ర వీడియో చూడాలనుకోవడం తో ఇంకా పెద్ద షాక్ అయ్యాడట. ఇక బాలయ్య 100 చిత్రం గురుంచి అనేక విషయాలు డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్ ముచ్చటించుకున్నారని సమాచారం. అయితే క్రిష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' స్పెషల్ వీడియోస్ చూడచ్చని ఎన్టీఆర్ తో క్రిష్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

మరి ఎన్టీఆర్ కి బాబాయ్ 100 చిత్రం గురించి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టిందో గాని బాలయ్య 100 చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం చించేసింది. ఇక ఈ టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ఆ చిత్ర యూనిట్ శత విధాలా కృషి చేస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో డైలాగ్స్ విందామా అని నందమూరి ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Similar News