బొద్దుగా మారగానే భీముడి పాత్ర అంటున్న నారా హీరో

Update: 2016-10-12 06:44 GMT

కొత్త తరహా కథలు, లేదా వైవిధ్య భరితమైన కథనాలు ఎంచుకునే నటుడిగా నారా రోహిత్ కు ఒక గుర్తింపు ఉండేది. అందుకే ఆయన చిత్రాలకు విశ్లేషణలు పట్టించుకోకుండా కచ్చితంగా థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులు కొందరు ఉండేవారు. అయితే నారా రోహిత్ నటించిన తుంటరి, సావిత్రి చిత్రాలు ఆయనకు ఉండే ప్రత్యేక ప్రేక్షకులలో వ్యతిరేక ముద్ర వేసాయి. తమిళంలో విజయం సాధించిన మాన్ కరాటే కథను అతి పేలవమైన కథనం ఎంచుకుని నారా రోహిత్ పెద్ద తప్పే చేసాడు. తరువాత పవన్ సాదినేని దర్శకత్వం వహించిన సావిత్రి చిత్రం ప్రేక్షకులకు నారా రోహిత్ కి మధ్య దూరం పెంచే అడ్డు గోడ లా ఉపయోగ పాడిందే తప్ప రోహిత్ కెరీర్ కి ఏమి ప్లస్ అవలేదు.

అవసరాల శ్రీనివాస్ పుణ్యమా అని జ్యోఅచ్చుతానంద తో నారా రోహిత్ మళ్లీ కుటుంబ ప్రేక్షకులకు కొంత చేరువ అయ్యాడు. ఆ చిత్రంలో నారా రోహిత్, నాగ సౌర్యాల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు స్వీయ జీవిత అనుబంధాన్ని తెరపై చుసిన అనుభూతి కలిగించేలా జాగ్రత్త వహించి అవసరాల శ్రీనివాస్ కథనం తో ఆకట్టుకున్నాడు. ఆ చిత్ర విజయం తర్వాత ఇప్పుడు రోహిత్ మళ్లీ సావిత్రి దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన హారర్ చిత్ర కథను ఒప్పుకుని ముహూర్తపు పూజా కార్యక్రమాలు కూడా కానిచ్చేశాడు.

ప్రతి శుక్రవారం విడుదల అయ్యే నాలుగు తెలుగు చిత్రాలలో కనీసం ఒక చిత్రం హారర్ నేపథ్యంలో వస్తుంది. కానీ హారర్ చిత్రాలు, హారర్ కామెడీ చిత్రాలు చూసి చూసి అలసిపోయిన ప్రేక్షకులు ఆ తరహా చిత్రాలకు మొగ్గు చూపటం తగ్గుతూ వస్తుంది. మరి ఇప్పుడు భీముడు గా రాబోతున్న చిత్రంతో నారా రోహిత్, పవన్ సాదినేని లు ఏ మేరకు అలరిస్తారో ప్రస్నార్ధకమే.

Similar News