బోయపాటికి గతిలేనప్పుడు నేను తిండిపెట్టా

Update: 2016-10-17 16:30 GMT

త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అబ్బూరి రవి, బి.వి.ఎస్.రవి, సంపత్ నంది లాంటి నేటి తరం ప్రముఖ దర్శక రచయితలు ఎందరో ఒకప్పుడు పోసాని క్రిష్ణ మురళి దగ్గర శిష్యరికం చేసినవారే. చాలా బిజీ రచయితగా వున్నా కాలంలో ఆయన దగ్గర విడతల వారీగా 28 మంది శిష్యులు పని చేసారు. తరువాత ఆయన రచనలు తగ్గించి కొంత కాలం దర్శకుడిగా, ఇప్పుడు బిజీ నటుడిగా మూడు దశాబ్దాల కాలంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను పోసాని దగ్గర పని చేయనప్పటికీ పోసాని ప్రోద్బలంతోనే ఈ స్థాయికి వచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో అనేక ఆరోపణలు బోయపాటి శ్రీను కి సావాళ్లుగా ఎదురు అవుతున్నాయి.

పోసాని క్రిష్ణ మురళి ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ప్రస్తావన రాగా తన ఆవేశానికి కారణాన్ని వ్యక్తపరిచారు. "వాళ్ళ ఊరులో మసీదు బైట పడుకునే వాడు బోయపాటి శ్రీను. ప్రతి పూటా తినటానికి తిండి దొరకని పరిస్థితి అతనిది. నా దగ్గరకు వచ్చి దర్శకత్వం వైపు ఆసక్తి వుంది అని చెప్తే, కొంత కాలం నేను, మా ఆవిడ బోయపాటికి తిండి పెట్టి ఆసరా కలిపించి, ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర బోయపాటి శ్రీనుకి అవకాశం మాట్లాడటానికి వెళ్తే, అప్పటికే రెండు బ్యాచ్లు శిష్యులు ఆయన దగ్గర ఉండేవారు. ఎవరిని తీయలేని పరిస్థితి. కొత్తగా చేరటానికి ఎందరో వేచి చూస్తున్నారు. అవకాశం కష్టం అంటే, ఈ కుర్రాడికి మీరు అవకాశం ఇవ్వనంటే నేను మీ చిత్రాలకు రాయను అని ఆ పెద్ద మనిషి దగ్గర మొండికేసి వాడికి పని ఇప్పించాను. ఎక్కువ మంది శిష్యులు ఉన్నప్పటికీ ఆయన దశాబ్ద కాలం పాటు నా మాట కి విలువ ఇచ్చి బోయపాటిని తీయకుండా ఉంచుకుని పని నేర్పారు. అటు వంటి వాడు నా మొదటి చిత్రం శ్రావణ మాసం ఆడకపోతే, తదుపరి చిత్రాల గతి కూడా ఇంతే అని అవహేళన చేసాడు. అది కూడా నా సమక్షంలో కాక వెనుక చేసాడు." అని ఆయన శైలి పదజాలంతో బోయపాటి శ్రీను పై తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు పోసాని క్రిష్ణ మురళి.

Similar News