భారీ ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడా..?

Update: 2017-07-01 05:32 GMT

ప్రభాస్ ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో కూర్చున్నాడు. 'బాహుబలి' సీరీస్ తో ప్రభాస్ జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించాడు. 'బాహుబలి' క్రేజ్ తోనే ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. 'సాహో' చిత్రంలో ప్రభాస్ న్యూ లుక్ తో కనబడనున్నాడని 'సాహో' టీజర్ చూసినప్పుడు మరియు ప్రభాస్ కి సంబందించిన కొన్ని ఫొటోస్ లీకులను బట్టి అర్ధమవుతుంది. అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న 'సాహో' చిత్రం తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది.

అందులోను కరణ్ జోహార్ తో మూడు చిత్రాలకు ప్రభాస్క కమిట్ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ 'సాహో' చిత్రం తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తాడనే దానిమీద అప్పుడే చర్చ మొదలైంది. అయితే ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రభుదేవా డైరెక్షన్ లో చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చాలా రోజులనుండి ప్రభాస్ తో పనిచేయాలని అనుకుంటున్నట్లు... 'సాహో' తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుదేవే స్వయంగా చెప్పాడంటున్నారు. అయితే ప్రభుదేవా - ప్రభాస్ కాంబినేషన్ లో ఇంతకుముందే 'పౌర్ణమి' వంటి ప్లాప్ సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా త్రిష, ఛార్మి నటించారు.

మరి అపట్లో ప్లాప్ ఇచ్చిన ప్రభుదేవాతో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ చిత్రం చేస్తాడంటారా..? అది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలంటున్నారు. ఇక 'సాహో' చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసుకుని అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ సగం కంప్లీట్ చేసుకున్నట్లు చెబుతున్నారు.

Similar News