మహేష్‌బాబును వాడుకుంటున్నారా? ఆడుకుంటున్నారా?

Update: 2016-10-25 13:20 GMT

మహేష్ బాబు జీవితంతో అందరూ ఓ ఆటాడేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన బతుకు చివరికి మార్కెటింగ్ ఎలిమెంట్ లాగా తయారైపోయినట్లుంది. ఇప్పటికే మహేష్ బాబు పలు సంస్థలకు వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి మార్కెటింగ్ గురించి ఆయన తరచూ టీవీల్లో కనిపించి జనానికి చెప్పేస్తూ ఉంటారు.

ఇదొక ఎత్తు అయితే.. పెద్ద స్టార్ లను చిన్న సినిమాల ఫంక్షన్లకు ఆహ్వానించడం.. ఆ రకంగా ఆ సినిమాల మార్కెటింగ్ జరిగేలా వారి ఇమేజిని వాడుకోవడం.. ఆడియో వేడుకలలో పెద్ద హీరోలతో పొగిడించుకోవడం ఇదంతా సినీ ఇండస్ట్రీలో చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. అలా అడ్డగోలుగా స్టార్ హీరోల ఇమేజిని చిన్న సినిమాలకు వాడేసుకోవడంలో తాజాగా మరోటి జరిగింది.

నందిని నర్సింగ్ హోం చిత్రం ద్వారా ప్రస్తుతం కేరక్టర్ వేషాలు వేస్తున్న నరేష్ కుమారుడు వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు వారు అడ్డగోలుగా మహేష్ బాబు ఇమేజిని వాడుకుంటున్నారు. మహేష్ పొగిడినట్లుగా చెప్పుకోవడం ఒక ఎత్తు. సినిమా గురించి పత్రికలో ఒక యాడ్ ఇస్తే అందులో అందరికంటె పెద్ద ఫోటో మహేష్ బాబు దే ముద్రించి.. అదేదో మహేష్ బాబు సినిమా అనేంతగా జనానికి ఫీలింగ్ కలిగేలా యాడ్ డిజైన్ చేయించారు.

ఇంతకూ మహేష్ బాబు ఏదో మొహమాటానికి చేయడం తప్ప.. నరేష్ కొడుకు చిత్రానికి ఆయనకు ఏంటి సంబంధం అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం రమేష్ బాబు కొడుకు, మంజుల పిల్లల సినిమా అయినా మహేష్ ను వాడుకోవడం ఓ రకంగా ఉంటుందిగానీ.. విజయనిర్మల మనవడి చిత్రం గురించి మహేష్ బాబు ఇమేజిని వాడుకోవాలని చూడడం మరీ ఘోరంగా ఉన్నదని పలువురు అంటున్నారు.

Similar News