మెగా స్టార్ తర్వాతే పవర్ స్టార్ అంటున్న సునీల్

Update: 2016-10-08 07:41 GMT

హాస్య నటుడిగా నట జీవితం ప్రారంభించి కథానాయకుడిగా మారి తన కెరీర్ ని తిరిగి గాడిన పెట్టుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నాడు సునీల్. స్వతహాగా మెగా స్టార్ చిరంజీవికి వీరాభిమాని ఐన సునీల్, మెగా స్టార్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తన 150 వ చిత్రంలో తన స్నేహితుడి పాత్ర కోసం సునీల్ ని సంప్రదించారు. కాని, అనూహ్యంగా ఆ పాత్రని పోషిస్తూ సెట్స్ నుంచి ప్రచారమైన వర్కింగ్ స్టిల్స్ లో తెర పైకి వచ్చారు ప్రముఖ హాస్య నటులు అలీ. ఈ తంతు చూసి అంతా సునీల్ ఇది మెగా స్టేర్ కి చేసిన అవమానంగా పరిగణించారు. ఆ వార్త తాలూకా వేడి చల్లారకముందే సునీల్ పవన్ కళ్యాణ్ చిత్రంలో హాస్య పాత్రను ఒప్పుకోవటం చర్చనీయాంశం ఐయ్యింది.

సునీల్ ఈ చర్చలకు తెర దింపుతూ చిరు 150 వ చిత్ర అవకాశం తనకి వచ్చిన నాటి తన పరిస్థితిని వివరిస్తూ "చిరంజీవి గారి కమ్ బ్యాక్ సినిమా కోసం నేను కూడా ఎప్పటి నుంచో ఆతురతగా ఎదురు చూస్తున్నాను. అనుకోకుండా నాకు ఆ చిత్రంలో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కాని నా పాత్ర సంబంధించిన చిత్రీకరణ సమయంలోనే నేను అప్పటికే ఒప్పందం కుదుర్చుకుని పని చేస్తున్న ఈడు గోల్డ్ ఎహె చిత్ర చిత్రీకరణ ఉండటంతో పైగా పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ కావటంతో, ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లి ఎంత కాలానికి కాల్ షీట్స్ కుదురుతాయో నమ్మకం లేదు. నిర్మాతని ఇబ్బంది పెట్టలేక నేను ఆ పాత్ర వదులుకున్నాను. కాని తర్వాత వేరే ఏదైనా చిన్న పాత్ర చేస్తానని నేనే వెళ్లి అడిగాను. ఖైదీ నెం.150 లో ఒక అతిధి పాత్రలో కనిపించనున్నాను. ముందు ఆ పాత్ర చిత్రీకరణలో పాల్గొంటాను తర్వాతే పవన్ కళ్యాణ్ గారి చిత్రం చిత్రీకరణ ఉంటుంది" అని తెలిపాడు.

సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహె చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన తదుపరి చిత్రం జక్కన్న ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Similar News